అన్వేషించండి

AI టెక్నాలజీ మన జీవితాల్ని సింప్లిఫై చేస్తుండొచ్చు, కానీ తస్మాత్ జాగ్రత్త - సీజేఐ చంద్రచూడ్

CJI DY Chandrachud: AI, చాట్‌జీపీటీ టెక్నాలజీపై సీజేఐ చంద్రచూడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

CJI DY Chandrachud: 


చాట్‌జీపీటీపై వ్యాఖ్యలు..

AI,ChatGPT టెక్నాలజీపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు కష్టమైన పనులనూ సింపుల్‌గా చేసేస్తున్నాయని అన్నారు. జోక్స్‌ చెప్పడం నుంచి కోడింగ్ వరకూ అన్నీ ఈ టెక్నాలజీతో సులభతరమైపోయాయని వెల్లడించారు. ఐఐటీ మద్రాస్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టెక్నాలజీతో లీగల్ సబ్జెక్ట్‌లనూ సులువుగా రాసే వెసులుబాటు వచ్చిందని తెలిపారు. హ్యూమన్ డెవలప్‌మెంట్‌కి ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో కూడా గమనించాలని సూచించారు. 

"ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ కెపాసిటీ ఈ టెక్నాలజీతో ఎంతో పెరిగిపోయింది. ఇదే సమయంలో చాట్‌జీపీటీ వినియోగమూ పెరిగింది. చిన్న చిన్న జోక్స్‌ నుంచి కోడింగ్ లాంటి అతి కష్టమైన విషయాలనూ ఈ టెక్నాలజీ చాలా సింప్లిఫై చేసింది. లీగల్ టాపిక్స్‌ని కూడా సులభంగా రాసే వెసులుబాటునిచ్చింది"

- డీవై చంద్రచూడ్, సీజేఐ

త్వరలోనే సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ని స్ట్రీమింగ్ చేయడంలో AI టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చెప్పారు. ట్రయల్ బేసిస్‌లో దీన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. 

"ట్రయల్ బేసిస్‌లో సుప్రీంకోర్టులోనూ AI టెక్నాలజీ వినియోగిస్తున్నాం. ప్రొసీడింగ్స్‌ని స్ట్రీమింగ్ చేసేందుకు వాడుతున్నాం. ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. మానవ అభివృద్ధిలో ఈ టెక్నాలజీ ఏ మేర ఉపయోగపడుతుందన్నది గమనించాలి. దీన్ని దుర్వినియోగం చేసే వాళ్లూ ఉంటారు.  ప్రజల్లో ఆ భయం కలిగితే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఈ ఆందోళన మొదలైతే ఎవరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోలేరు. మానవ విలువలతో పాటు వ్యక్తిగత గోప్యత చాలా అవసరం. టెక్నాలజీ కారణంగా ఇవి మిస్‌యూజ్ అవ్వకూడదు. ఆన్‌లైన్‌ వేధింపులు, బెదిరింపులు కూడా పెరిగే ప్రమాదముంది. "

- డీవై చంద్రచూడ్, సీజేఐ

స్పెషల్ కోర్స్...

కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌కు సంబంధించి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ ఇండియా, జీయూవీఐ మధ్య పరస్పర సహకారంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ, హిందీతోపాటు ఇంగ్లిష్‌లో ఈ కోర్సును అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కోర్సును ప్రారంభిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే బోధన ఉంటుంది. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు 'నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీవీఈటీ)', ఐఐటీ మద్రాస్ గుర్తింపు కూడా దక్కించుకుంది. ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీ జీయూవీ.. పర్సనలైజ్డ్ లెర్నింగ్ సొల్యూషన్స్‌ విభాగాల్లో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ వివిధ ప్రాంతీయ భాషల్లో సాంకేతిక నైపుణ్యాలను బోధించడం, ఆన్‌లైన్ లెర్నింగ్, అప్‌స్కిల్లింగ్, రిక్రూట్‌మెంట్ అవకాశాల వంటి సేవలను అందిస్తోంది. 

Also Read: Longest Serving CM: ఒడిశా సీఎం సరికొత్త రికార్డు, అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రెండో లీడర్‌గా నవీన్ పట్నాయక్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Embed widget