By: ABP Desam | Updated at : 23 Jul 2023 03:06 PM (IST)
Edited By: Pavan
ఒడిశా సీఎం సరికొత్త రికార్డు, అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రెండో లీడర్‌గా నవీన్ పట్నాయక్ ( Image Source : ABP )
Longest Serving CM: రాజకీయాల్లో సుదీర్ఘకాలం పదవిలో కొనసాగడం చాలా కష్టం. అందుకే పాలిటిక్స్ లో ఏదీ శాశ్వతం కాదు అని అంటుంటారు. అలాగే ఒక్కసారి పదవి వస్తే కొన్ని రోజుల పాటు కొనసాగడమే అతికష్టంగా ఉంటుంది. ఒకటీ రెండుసార్లు వరుసగా పదవి సాధించడం ఎంతో కష్టంగా ఉన్న రోజులు ఇవి. కానీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒకటీ రెండుసార్లు కాదు ఏకంగా వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి సీఎం పదవి చేపట్టారు. తాజాగా ఆయన ఓ రికార్డును కూడా బద్దలు కొట్టారు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రెండో వ్యక్తిగా రికార్డు నెలకొలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు రికార్డును తాజాగా నవీన్ పట్నాయక్ అధిరోహించి.. రెండో స్థానంలో నిలిచారు. శనివారంతో నవీన్ పట్నాయక్ సీఎం హోదాలో 23 ఏళ్ల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. కాగా, దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన నేతగా సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఉన్నారు. ఆయన 24 ఏళ్లకు పైగా సీఎం హోదాలో పని చేశారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్టు పార్టీ నేత జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు 23 ఏళ్ల 137 రోజులు సీఎంగా కొనసాగారు. ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ 2000 మార్చి 5వ తేదీ నుంచి 5 సార్లు సీఎం బాధ్యతలు చేపట్టి శనివారం నాటికి 23 సంవత్సరాలు 138 రోజులు పూర్తి చేసుకున్నారు. పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతి బసు తర్వాత వరుసగా ఐదు సార్లు సీఎంగా పని చేసిన నేతగానూ నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో నిలిచారు. వచ్చే ఏడాది 2024 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజూ జనతాదల్ - బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే.. వరుసగా 6 సార్లు సీఎంగా పని చేసిన వ్యక్తిగా నవీన్ పట్నాయక్ రికార్డు బద్దలు కొడతారు. దాంతో పాటు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా కూడా పవన్ కుమార్ చామ్లింగ్ ను దాటి మొదటి స్థానంలో నిలుస్తారు. నవీన్ పట్నాయక్ 1997లో రాజకీయాల్లోకి వచ్చారు. 2000 లో సీఎం అయ్యారు. 2000, 2004, 2009, 2014, 2019 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చారు.
నవీన్ పట్నాయక్ ఒడిశా ప్రజల మద్దతును పొందడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. ఐదుసార్లు ఆయన తన ప్రజల నుంచి విశేష మద్దతును నిలుపుకున్నారు. బెస్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అదే విధంగా పారిశ్రామికీకరణలో ఒడిశాలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. విదేశీ పెట్టుబడుల్లో దేశంలోని ఒడిశా రెండో స్థానంలో నిలిపారు. అయితే నవీన్ పట్నాయక్ 23 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నప్పటికీ.. ఒడిశా ఇంకా పేద రాష్ట్రంగానే ఉందనే విమర్శలు ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి వస్తుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన ఒడిశాను అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదని ప్రతిపక్షలు విమర్శిస్తుంటాయి.
Odisha CM Naveen Patnaik equals former West Bengal CM Jyoti Basu’s record of second longest-serving CM of India.
But Naveenbabu has set a benchmark for good administration and has elevated his state to new heights.
While Jyoti Basu has singlehandedly destroyed a prosperous state pic.twitter.com/NYkkwwBoge— Tathagata Roy (@tathagata2) July 22, 2023
Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
FSSAI: న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయొద్దు, ఆరోగ్యానికి ప్రమాదం- ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక
అంబులెన్స్ కు దారివ్వని బిహార్ సీఎం సెక్యూరిటీ, ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు
Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు
ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>