అన్వేషించండి

Aditya L1 Mission: సూర్యుడిని ఆదిత్య ఎల్1 ఎలా ఫొటోలు తీసిందంటే!

ISRO: అంతరిక్షంలో సూర్యుడి ఫొటోలు తీసేందుకు ఆదిత్య-ఎల్1లో ఏర్పాటు చేసిన సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT)‌ తెరుచుకునే వీడియోను ISRO విడుదల చేసింది.

Aditya L1 Mission: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో అద్భుత ఘటాన్ని ఆవిష్కరించింది. అంతరిక్షంలో సూర్యుడి ఫొటోలు తీసేందుకు ఏర్పాటు చేసిన సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT)‌ పేలోడ్ తెరుచుకునే వీడియోను ISRO విడుదల చేసింది. ఇందులో వాహక నౌక నుంచి పేలోడ్ తెరుచుకోవడం కనిపిస్తుంది. ఇది అంతరిక్ష పరిశోధనలో భారత విజయాన్ని ప్రతిబింబించనుంది.

చంద్రయాన్-3 (Chandrayaan -3) సక్సెస్ తర్వాత సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఆదిత్య- ఎల్‌1 (Aditya L1)ను ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 2న ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1ను నవంబర్‌లో అది సూర్యుడి సమీపానికి చేరుకుంది. దీంతో ఆదిత్య -ఎల్1లో ఉన్న సోలార్ అల్ట్రావైలైట్‌ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT)ను నవంబర్‌ 20న యాక్టివేట్‌ చేశారు.  

డిసెంబర్‌ 6న సూర్యుడి ఆదిత్య- ఎల్1 అరుదైన చిత్రాలను క్లిక్‌ మనిపించింది. సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ పేలోడ్‌ సాయంతో సూర్యుని నుంచి 200 నుంచి 400 నానో మీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలోని ఫొటోలను తీసింది. ఇందుకోసం ఏకంగా 11 వేర్వేరు ఫిల్టర్లను ఉపయోగించి అతినీలలోహిత తరంగ దైర్ఘ్యం దగ్గర నుంచి సూర్యుని ఫొటోలను తీసింది.  ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. సౌర కుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయంటూ పేర్కొంది. 

ఆదిత్య - ఎల్1 సూర్యుని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌ల ఫొటోలు తీస్తుందని, వాటికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది. అయస్కాంత క్షేత్రానికి సంబంధించి తెలుసుకోవడంలో ఈ చిత్రాలు కీలక సమాచారాన్ని అందిస్తాయని ఇస్రో పేర్కొంది. సూర్య కిరణాలు, సోలార్‌ స్పాట్‌లు, సోలార్‌ రేడియేషన్‌ను అధ్యయనం చేయడానికి ఈ పొరలు కీలకమని వివరించింది. అంతరిక్ష వాతావరణం, భూమి వాతావరణంపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. 

పూణేలోని ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ (IUCAA) నాయకత్వంలో వివిధ భారతీయ విద్యా సంస్థలు, ISRO సహకారంతో SUIT ను అభివృద్ధి చేశారు. ఇది సౌర వాతావరణం దిగువ, మధ్య పొరలను పరిశీలించడానికి రూపొందించబడింది. ఇది 200 - 400 nm సమీప అతినీలలోహిత తరంగదైర్ఘ్యం పరిధిలో తన పనితనాన్ని చూపిస్తుంది. 

సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఈఏడాది సెప్టెంబర్‌ 2న ఇస్రో ఆదిత్య ఎల్-1ని ప్రయోగించింది. నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యోమనౌక తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంది. ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించిన సుమారు 127 రోజుల తర్వాత భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజ్‌ పాయింట్-1 వద్దకు చేరుకుంటుంది. అక్కడ L1 కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతాయని ఇస్రో తెలిపింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget