అన్వేషించండి

ABP Southern Rising Summit 2025: ఉదయనిధి స్టాలిన్, అన్నామలై నుంచి కేటీఆర్ వరకు... సదరన్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖులు ఎవరంటే

ABP’s Southern Rising Summit 2025 | ఏబీపీ సౌత్ రైజింగ్ సమ్మిట్ 2025 నవంబర్ 25న చెన్నైలో తిరిగి ప్రారంభం కానుంది. ప్రముఖ నేతలు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ABP Southern Rising Summit 2025: ఏబీపీ నెట్‌వర్క్ మూడవ ఎడిషన్‌ను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఇది "సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025" చెన్నై వేదికగా నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ థీమ్ ఏంటంటే: “భవిష్యత్తు కోసం సిద్ధం: ఆవిష్కరణ, పరివర్తన, ప్రేరణ”. దక్షిణాది ప్రాంతం దేశంలో పెరుగుతున్న ప్రభావంపై చర్చించేందుకు, అభిప్రాయాలు పంచుకునేందుకు రూపొందించారు. దక్షిణ భారతదేశం స్థానాన్ని రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక శక్తుల గురించి లోతైన విశ్లేషణను అందించేలా సదరన్ రైజింగ్ సమ్మిట్‌ను ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహిస్తోంది.

ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025

నవంబర్ 25న మంగళవారం నాడు చెన్నైలోని ITC గ్రాండ్ చోళాలో ABP దక్షిణ రైజింగ్ సమ్మిట్ 2025 నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ రూపకర్తలు..  రాజకీయ, సినీ, పలు రంగాల ప్రముఖులతో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించనున్న సమావేశంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి, తెలంగాణ మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (KTR), మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నటి మాళవిక మోహనన్, బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, PMK నాయకుడు అన్బుమణి రామదాస్ వంటి ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు. 

ఈ సమ్మిట్ సృజనాత్మకత, ప్రేరణకు ఒక వేడుకగా మారనుంది. ప్రసిద్ధ నేపథ్య గాయని కవితా కృష్ణమూర్తి వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రముఖ స్టాండప్ ఆర్టిస్ట్ శ్రద్ధా జైన్ (అయ్యో శ్రద్ధా) తన కామెడీతో అలరించనున్నారు. మహిళా సాధికారతపై బలమైన కథనాన్ని జోడిస్తూ, క్రేన్ ఆపరేటర్లు నతానా మేరీ జె.డి., మేఘా ప్రసాద్ రెజితా ఆర్.ఎన్. పురుషాధిపత్య వృత్తులలో రాణిస్తున్న మహిళలుగా వారి అసాధారణ జర్నీని షేర్ చేసుకుంటారు. ఈ మొత్తం కార్యక్రమం ABP డిజిటల్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. 

దక్షిణాది వాయిస్ ప్రతిబింబించే వేదిక

దక్షిణ రైజింగ్ సమ్మిట్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాంతం వృద్ధి కథనాలను సంగ్రహించే ఒక ముఖ్యమైన వేదికగా ఎదిగింది. దక్షిణ రాష్ట్రాలు బలమైన తయారీ, IT, కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలలో ఆర్థిక ఆవిష్కరణలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా కార్మికుల భాగస్వామ్యం పెరగడం వంటి వాటిలో సాధించిన పురోగతి ఈ ప్రాంతాన్ని సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధికి ఒక నమూనాగా నిలబెడుతున్నాయి.

ABP నెట్‌వర్క్ 2025 ఎడిషన్‌తో తిరిగివస్తూ సరిహద్దులను అధిగమిస్తూ, మార్పులను స్వీకరిస్తూ, దేశానికి స్ఫూర్తినిచ్చే ఒక ప్రాంత సమూహాన్ని ఒకే వేదిక మీదకు తీసుకురావడంపై దృష్టి సారిస్తుంది. దీనిని www.abplive.com, news.abplive.com, abpdesam.com, abpnadu.com లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనిని ABP న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు.

మునుపటి ఎడిషన్‌లపై ఒక లుక్

2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నిర్వహించిన ABP నెట్‌వర్క్ తొలి సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023లో అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్, స్టార్ హీరో రానా దగ్గుబాటి, రచయిత గుర్‌చరణ్ దాస్, తమిళనాడు ఐటీ మంత్రి పి. త్యాగరాజన్, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

2024 ఎడిషన్ వేగాన్ని పెంచింది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ రెండో ఎడిషన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు, దిగ్గజ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, చిత్రనిర్మాత చిదంబరం ఎస్. పొదువల్, నటీనటులు గౌతమి తాడిమల్ల, సాయి దుర్గా తేజ్, రాశి ఖన్నా లను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.

చెన్నై (2023), హైదరాబాద్ (2024)లో నిర్వహించిన మొదటి రెండు ఎడిషన్‌లను ఇక్కడ చూడవచ్చు: bit.ly/SouthernRising.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget