ABP Southern Rising Summit 2023 LIVE: మీరు వారితో పొత్తులో లేరా.?: 'కుటుంబ పాలన' విమర్శలపై కవిత
ABP Southern Rising Summit 2023 LIVE Updates: ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023 ప్రారంభమైంది. దక్షిణాది ఐదు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
LIVE

Background
దక్షిణ భారత ప్రాంతీయ పార్టీలపై కత్తి వేలాడుతోంది: ఉదయనిధి
2026 డీలిమిటేషన్ గురించి ఉదయనిధి ఆందోళన వ్యక్తం చేశారు. 1952 మరియు 1963లో డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పడ్డాయని అన్నారు. లోక్ సభలో మొత్తం స్థానాల సంఖ్య, ప్రతి రాష్ట్రం కలిగి ఉండే అసెంబ్లీ స్థానాల సంఖ్యపై ఈ కమిషన్లు సిఫారసు చేశాయని చెప్పారు. ప్రస్తుతం 'దక్షిణ భారత ప్రాంతీయ పార్టీల తలపై కత్తి వేలాడుతోంది.' అని ఉదయనిధి పేర్కొన్నారు.
విధులను అడ్డుకునేందుకు కేంద్రం గవర్నర్లను పంపిస్తోంది: ఉదయనిధి
కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకునేందుకు కేంద్రం గవర్నర్లను పంపిస్తోందని ఆయన అన్నారు.
తమిళనాడు అభివృద్ధికి ద్రావిడ పాలనే కారణం: ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు ఓ పురోగతి సాధించినా ద్రావిడా పాలనా విధానం వల్లనే అని తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 70వ దశకంలో కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని ప్రోత్సహించిందని, దక్షిణ భారత రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేశాయని చెప్పారు.
జనాభా గణన ఎందుకు చేయలేదు: కవిత
దేశంలో జన గణన ఎందుకు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీని ప్రశ్నించారు. కుల గణనను విస్మరించడంపై ఆందోళన చెందడం సహా జనాభా గణన ఎందుకు చేయలేదని అన్నారు.
కాంగ్రెస్ సోనియా గాంధీ ఆ నిర్ణయం తీసుకోలేదా.?: అన్నామలై
కుల జనాభా గణనపై చేసిన వాదనను బీజేపీ చీఫ్ అన్నామలై తప్పుబట్టారు. 'మాకు ఓబీసీ ప్రధాని ఉన్నారు. వారికి బీజేపీ ఇచ్చిన ప్రాతినిధ్యం మరే పార్టీ ఇవ్వలేదు. కాంగ్రెస్ హయాంలో సోనియాగాంధీ ఎలా రికార్డుల్లోకి ఎక్కారో గుర్తులేదా?, క్యాబినెట్‌లో ఎలాంటి ఒప్పందం లేదని పేర్కొంటూ కుల గణన డేటాను బహిర్గతం చేయడాన్ని తిరస్కరించారు' అని అన్నామలై గుర్తు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

