ABP News wins most Golds: న్యూస్ అవార్డులలో ఏబీపీ న్యూస్ నెంబర్ వన్, 6 స్వర్ణాలతో అగ్రస్థానం
ABP News wins most Golds: AFAQS అవార్డులలో ABP News అత్యధిక బంగారు పతకాలు కైవసం చేసుకుని నెంబర్ వన్ మీడియాగా నిలిచింది.
AFAQS Awards: న్యూఢిల్లీ: కచ్చితమైన సమాచారంతో రోజురోజుకూ మీడియా రంగంలో దూసుకెళ్తోంది ఏబీపీ న్యూస్ (ABP News) నెట్ వర్క్. ప్రజల ఆధరణతో మరోసారి ఏబీపీ న్యూస్ టాప్ లో నిలిచింది. వరుసగా రెండో ఏడాది న్యూస్ అవార్డులలో ఏబీపీ న్యూస్‌కు అరుదైన గౌరవం దక్కింది. AFAQS అవార్డులలో ABP News అత్యధిక బంగారు పతకాలు కైవసం చేసుకుని నెంబర్ వన్ మీడియాగా నిలిచింది. ఏబీపీ న్యూస్ 6 విభాగాలలో స్వర్ణాలు కొల్లగొట్టింది. ద క్వింట్, టీవీ9 భారత్ వర్ష్ చెరో 5 స్వర్ణాలు అందుకున్నాయి.
AFAQS రెండో ఎడిషన్ న్యూస్ అవార్డులు ఇటీవల ప్రకటించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఢిల్లీలోని మయూర్ విహార్ లోని హాలిడే ఇన్ లో ఘనంగా నిర్వహించారు. టీవీ, ఆన్ లైన్ వీడియో సంబంధిత మీడియాను ఈ అవార్డుల ఎంపికకు పరిగణనలోకి తీసుకున్నారు. ఫ్యూచర్ ఆఫ్ న్యూస్ అవార్డ్స్ ను 4 సూపర్ కేటగిరీలు, 20 సబ్‌కేటగిరీలుగా విభజించి అవార్డులు ప్రకటించారు. హిందీ, ఇంగ్లీష్ టీవీ, ఆన్ లైన్ వీడియో న్యూస్ సంస్థలకు ప్రొగ్రామింగ్, డిజైన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ విభాగాలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సంవత్సరం మూడు సూపర్ కేటగిరీలను అదనంగా ప్రవేశపెట్టారు. ఈవెంట్ బెస్ట్ యాంకర్, బెస్ట్ న్యూస్ రిపోర్టర్, బెస్ట్ వీడియోగ్రాఫర్ కేటగిరీలలో వ్యక్తిగతంగా అవార్డులను ప్రవేశపెట్టారు. నిపుణులతో కూడిన ప్రముఖ జ్యూరీ ద్వారా ఎంట్రీలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా అవార్డుల ఎంపిక జరిగింది. ఏబీపీ న్యూస్ మొత్తం 9 అవార్డులను కైవసం చేసుకోగా, అందులో 6 స్వర్ణాలు ఉన్నాయి.
ఏబీపీ న్యూస్ (9 అవార్డులివే):
- ఉత్తమ సెట్ డిజైన్ (గోల్డ్)
- న్యూస్ స్టోరీలో బెస్ట్ ఇన్ఫోగ్రాఫిక్స్ వాడకం (గోల్డ్)
- ఉత్తమ యాంకర్ (గోల్డ్, సిల్వర్) 2
- ఎంటర్ టైన్మెంట్ లో బెస్ట్ కవరేజ్ (గోల్డ్, సిల్వర్)
- ఉత్తమ పరిశోధనాత్మక రిపోర్టింగ్ (గోల్డ్)
- ఉత్తమ ప్రైమ్ టైమ్ షో (గోల్డ్)
- బెస్ట్ టాక్ షో (సిల్వర్)