Ideas of India Summit 2023 Live: భారత్‌పై ద్వేషంతోనే పాకిస్థాన్ ఏర్పడింది - ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణ గోపాల్
Ideas of India 2023: ఏబీపీ న్యూస్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ రెండో ఎడిషన్ నేడు(ఫిబ్రవరి 24 )ముంబైలో ప్రారంభమైంది. ఇందులో సెలబ్రిటీలందరూ వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు.
LIVE
Background
Ideas of India Summit 2023 Live: ఏబీపీ నెట్ వర్క్ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023' కార్యక్రమం ప్రారంభమైంది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ముంబైలోని గ్రాండ్ హయత్ లో జరిగే ఈ సదస్సు రెండో ఎడిషన్ ఇది. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలందరూ ఒకే వేదికపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ ఏడాది సదస్సు థీమ్ "న్యూ ఇండియా: లుకింగ్ ఇన్‌వర్డ్, రీచింగ్ అవుట్"
ప్రతి ఏటా న్యూ ఇండియా కాన్సెప్ట్, ఐడియాలను ఏబీపీ నిర్వహించే ఈ వార్షిక సదస్సు ఏకతాటిపైకి తెస్తుంది. ప్రపంచం భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న తరుణంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ జరుగుతోంది. ఫిబ్రవరి 24న రుస్సో-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది పూర్తైది. వచ్చే ఏడాది భారత్‌లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ఏబీపీ సదస్సు దేశంలోని పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది. ప్రస్తుతం చరిత్రలో భారత్ ఎక్కడ ఉంది, మహమ్మారి కరోనా అనంతర మార్పులు, కొత్త కార్పొరేట్ సంస్కృతి వంటి అంశాలపై ఈ రెండు రోజుల కార్యక్రమం దృష్టి సారించనుంది.
బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నారాయణమూర్తి, కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఈ సదస్సుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 వేదిక నుంచి అమన్, ఆశా పరేఖ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మ్యూజిక్ దిగ్గజాలు న్యూ ఇండియా గురించి తమ ఆలోచనలను అందించనున్నారు. వీరితో పాటు అమితవ్ ఘోష్, దేవదత్ పట్నాయక్ వంటి ప్రముఖ రచయితలు కూడా వేదికను పంచుకోనున్నారు.
60 మందికి పైగా వక్తలు పాల్గొంటారు.
ఏబీపీ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2023లో 40 సెషన్లు జరగనుండగా, ఇందులో 60 మందికి పైగా వక్తలు పాల్గొంటారు. నవ భారతం గురించి తమ ఆలోచనలను వాళ్లు పంచుకుంటారు.
ఏబీపీ నెట్వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023ను ఏబీపీ లైవ్ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. వీటితోపాటు ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ సెషన్లు కూడా ఏబీపీ నెట్ వర్క్ ఛానెల్ లో ప్రసారం అవుతున్నాయి.
ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ తాజా అప్డేట్స్, హైలైట్స్ను ఏబీపీ దేశం వెబ్‌సైట్‌తోపాటు సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూడొచ్చు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్
Also Read: ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు 2023 లైవ్ ఎక్కడ ఎలా చూడాలి?
Also Read: ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ రెండో ఎడిషన్ ఫిబ్రవరి 24న ముంబైలో ప్రారంభం
Also Read: దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ హబ్‌గా మార్చే ప్రణాళిక, ఏబీపీ నెట్ వర్క్ ఆధ్వర్యంలో!
పాకిస్థాన్ తన అలవాటును మార్చుకోవాలి: కృష్ణ గోపాల్
పాకిస్తాన్ తన మనస్సును సరిగ్గా ఉంచుకోవాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నాలుగు సార్లు ఆక్రమణకు యత్నించి విఫలమైంది. తన స్వభావాన్ని మెరుగుపరుచుకోవాలి. భారత్ తో శత్రుత్వ భావనను శాశ్వతంగా వదిలేయాలి. భారత్‌పైకి ఉగ్రవాదులను పంపిస్తోంది కాబట్టి సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం కొంచెం కష్టమే: కృష్ణ గోపాల్, ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి
యోగి ఆదిత్యనాథ్‌పై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రశంసలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణగోపాల్ ఏబీపీ వేదికపై ప్రశంసలు కురిపించారు.
కుల గణన డిమాండ్‌లో రాజకీయాలు: కృష్ణ గోపాల్
కుల గణన డిమాండ్‌లో రాజకీయం ఉంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. సమాజంలో కుల వర్గాల మధ్య చిచ్చుపెట్టే ఏ కార్యక్రమం మాకు అవసరం లేదు. కుల అస్తిత్వాన్ని ఏ ఆపరేషన్ ద్వారా బలోపేతం చేయకూడదు: ఆరెస్సెస్ నేత కృష్ణ గోపాల్
జనాభా లెక్కల అంశంపై కృష్ణ గోపాల్ మాట్లాడుతూ..
జనాభా గణన అంశంపై ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఇది దేశ పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది జనాభాలో ప్రమాదకరమైన మార్పులను కూడా వెలికి తీస్తుందన్నారు.
పాకిస్థాన్ లో హిందువుల జనాభా తగ్గింది: కృష్ణ గోపాల్
శత్రుత్వం ఆధారంగా పాకిస్థాన్ ఆవిర్భవించింది. 'మేము భారత్ తో ఉండలేం' అనే జిన్నా, ఇక్బాల్ నమ్మకం పాకిస్తాన్ ఏర్పాటుకు దారితీసింది. ఇక్కడి హిందువులతో కలిసి జీవించలేమని వారు భావించారు. ఇది తప్పుడు విధానం. అయితే, ముస్లిం జనాభా ఇక్కడ నివసిస్తోంది. అభివృద్ధి చెందుతోంది. పాకిస్తాన్‌లో హిందూ జనాభా తగ్గింది: కృష్ణ గోపాల్