News
News
X

ABP Network Ideas Of India 2023: ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ రెండో ఎడిషన్ ఫిబ్రవరి 24న ముంబైలో ప్రారంభం

60 మంది ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వక్తలు ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా వేదికపై ఆలోచనలు పంచుకోనున్నారు. 'నయా ఇండియా: లుకింగ్ ఇన్‌వర్డ్, రీచింగ్ అవుట్' అనే థీమ్‌తో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

FOLLOW US: 
Share:

ఇండియాలోనే ప్రముఖ మల్టీ లాంగ్వేజ్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ ఏబీపీ నెట్‌వర్క్ Ideas Of India రెండో ఎడిషన్ సమావేశాలను నిర్వహిస్తోంది. 2022లో ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ సదస్సులో చెప్పినట్టుగానే మరోసారి వైవిధ్యమైన కాన్సెప్టుతో మీ ముందుకు వచ్చింది Ideas Of India రెండో ఎడిషన్. 

దేశంలో వివిధ రంగాల్లో తమ శక్తియుక్తులతో అద్భుతాలు సాధించిన ఎంతో మంది అనుభవజ్ఞులను ఈ Ideas Of India వేదికపైకి తీసుకొస్తోంది ఏబీపీ. అత్యంత విజయవంతమైన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్‌లో భాగంగా 2023లో జరగబోయే సెకండ్ ఎడిషన్‌ను నయా ఇండియా: లుకింగ్ ఇన్‌వర్డ్, రీచింగ్ అవుట్ అనే థీమ్ చుట్టూ డిజైన్ చేశారు. 

ABP నెట్‌వర్క్ CEO అవినాష్ పాండే మాట్లాడుతూ, “2022లో ABP నెట్‌వర్క్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' మొదటి ఎడిషన్ అద్భుతమైన విజయం సాధించింది. కేవలం వ్యూవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని చెప్పడం లేదు... భిన్న ఆలోచనలు పంచుకునే ఫోరమ్‌కు సరైన అర్థాన్ని ఇచ్చే వేదికగా మారిందీ ప్రోగ్రామ్. అందుకే నాకు ఒకటి బాగా అర్థమైంది. ABP ఐడియాస్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌ కేవలం ఓ సమావేశం మాత్రమే కాదు. ఇది భారత దేశ బహుళత్వాన్ని తెలియజేసే ఆలోచనలు పంచుకునే వేదికగా మారింది. అందుకే దీనికి కట్టుబడి ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక యూనిట్‌గా వేల ఆలోచనలు మథించి మంచి చెడు చర్చిస్తే ఓ మంచి ఆలోచన  ఏర్పడుతుంది. 

రేపటి భారతం ఎలా ఉండాలనే ఆలోచనలు పంచుకునేందుకు ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఓ అధికారిక వేదిక కానుంది. ABP నెట్‌వర్క్ నిర్వహించే 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023' సందర్బంగా ఈ ప్రకటన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆత్మపరిశీలన చేసుకుంటూనే ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తూ నయా భారత్‌ నిర్మాణానికి ఈ 2023 శిఖరాగ్ర సమావేశం దోహదపడనుంది.  

ఈ సంవత్సరం ముంబైలో జరిగే 2-రోజుల ఈవెంట్ ప్రధానంగా ఈ ప్రశ్నకు సమాధానాలను వెతకనుంది. చరిత్రలో భారత్‌ ఎలాంటి స్థితిలో నిలిచింది? ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. ఐరోపాలో యుద్ధచ్ఛాయలు కనిపిస్తున్నా ఇంధన అవసరాలను సమర్థంగా తీర్చుకుంటోంది. కరోనా తర్వాత ఇండియాను గ్లోబల్ లీడర్‌గా ప్రపంచం చూస్తోంది. ఈ టైంలో భారత యువత వివిధ రంగాల్లో నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉందా? అసహనంతో ఉందా అనేదానిపై చర్చ జరగనుంది. 

ఈ కీలకమైన ప్రశ్నను ఆలోచనాపరులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రాయబారులు, రాజకీయ నాయకులు ఇలా వక్తల జాబితా చాలా పెద్దదిగా వైవిధ్యంగా ఉంటుంది. యూకే మాజీ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ నుంచి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఏక్నాథ్ షిండే వంటి ముఖ్యమంత్రుల వరకు విస్తరించింది; నవలా రచయిత, పర్యావరణ ఛాంపియన్ అమితవ్ ఘోష్ నుంచి టెక్, బిజినెస్ ఇన్నోవేషన్ ఐకాన్ ఎన్‌ ఆర్‌ నారాయణ మూర్తి వరకు; అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన విద్యావేత్త, రచయిత మహమూద్ మమదానీ నుంచి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, మరో కేంద్ర మంత్రి-ఇన్‌చార్జ్ అశ్విని వైష్ణవ్, కళలు, సినిమా ప్రపంచం నుంచి జీనత్ అమన్, ఆశా పరేఖ్ వంటి వారితోపాటు ఆయుష్మాన్ ఖురానా వంటి సూపర్ స్టార్‌లు ఇందులో పాల్గొంటున్నారు.  ఎందరికో ఆదర్శంగా ఉండే వినేష్ ఫోగట్, అశ్విని నాచప్ప, జ్వాలా గుత్తా, జోష్నా చినప్ప తమ ఆలోచనలు పంచుకోనున్నారు. 'ఖాన్ సార్', 'ఎన్‌వి సార్' వంటి విద్యా మార్గనిర్దేశకులు నాలెజ్డ్‌ పొందడంపై మాట్లాడతారు. అంతర్జాతీయ చలనచిత్ర దర్శకులు మీరా నాయర్, శేఖర్ కపూర్, నటులు మనోజ్ బాజ్‌పేయి కూడా ప్యానెల్‌లో ఉన్నారు. లక్కీ అలీ, దేవదత్ పట్నాయక్ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తారు. సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా తన వంట మహత్యాన్ని పంచుకోనున్నారు. యువ రాజకీయ ప్రముఖులు పూనమ్ మహాజన్, కె కవిత, ప్రియాంక చతుర్వేది, రాఘవ్ చద్దా వారి వ్యక్తిగత జీవితం, రాజకీయ పార్టీల విధానాలను వివరిస్తారు. నయా భారతదేశం కోసం తీసుకోవాల్సిన అంశాలను వివరిస్తారు. 

ABP ఐడియాస్ ఆఫ్ ఇండియా 2023, 60 కంటే ఎక్కువ మంది వక్తలు 40 చర్చల్లో పాల్గొంటారు. ఇది దేశాన్ని సరికొత్త భారతావనిగా మార్చేందుకు బలాలను గురించి మాట్లాడతారు. ABP ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 ఫిబ్రవరి 24, 25 రెండు రోజుల్లో, మొత్తం ABP నెట్‌వర్క్‌లోని అన్ని విభిన్న డిజిటల్ ప్రసార ప్లాట్‌ఫారమ్‌లలో దీన్ని చూసే వీలు ఉంది.  

Published at : 23 Feb 2023 01:45 PM (IST) Tags: Ideas of India Ideas of India Live Ideas of India Summit 2023 Ideas of India 2023 ABP Network Ideas of India by ABP Network Ideas of India Second Edition Ideas of India 2.0

సంబంధిత కథనాలు

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Howrah Violence: హింసాత్మకంగా మారిన నవమి వేడుకలు, బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్

Howrah Violence: హింసాత్మకంగా మారిన నవమి వేడుకలు, బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్

Navjot Singh Sidhu: నవజోత్ సింగ్ సిద్దు విడుదలకు అంతా సిద్ధం, 2 నెలలు ముందుగానే బయటకు

Navjot Singh Sidhu: నవజోత్ సింగ్ సిద్దు విడుదలకు అంతా సిద్ధం, 2 నెలలు ముందుగానే బయటకు

Sanjay Raut Death Threat: సంజయ్‌ రౌత్‌కు బిష్ణోయ్ గ్యాంగ్‌ బెదిరింపులు, చంపేస్తామని వాట్సాప్‌లో వార్నింగ్

Sanjay Raut Death Threat: సంజయ్‌ రౌత్‌కు బిష్ణోయ్ గ్యాంగ్‌ బెదిరింపులు, చంపేస్తామని వాట్సాప్‌లో వార్నింగ్

SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి

SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?