News
News
X

Kejriwal House Vandalized: దిల్లీలో 'కశ్మీర్ ఫైల్స్' మంటలు- కేజ్రీవాల్ ఇంటిపై భాజపా కార్యకర్తల దాడి

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై భాజపా కార్యకర్తలు దాడి చేశారని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియోను చూడండి.

FOLLOW US: 

'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రం దిల్లీలో మంటలు రేపుతోంది. ఈ చిత్రంపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నివాసం వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు. భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు తేజస్వీ సహా 40-50 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

కేజ్రీవాల్ నివాసం వైపు నిరసనగా వెళ్లేందుకు ప్రయత్నించిన  భాజపా కార్యకర్తలను వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో నిరసన హింసాత్మకంగా మారింది. బారీకేడ్లను దాటుకుని కొంతమంది కార్యకర్తలు ముందుకు వెళ్లారు. దీంతో పోలీసులు వారిపై జలఫిరంగులను ప్రయోగించారు. ఆ తర్వాత వాళ్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

ఆప్ ఆరోపణ

ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపాలని భాజపా అనుకుంటోందని ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. పంజాబ్‌లో ఓటమిని తట్టుకోలేక కేజ్రీవాల్‌ను చంపాలని భాజపా వ్యూహాలు రచిస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు కూడా నమోదు చేస్తామన్నారు.

కేజ్రీవాల్ నివాసం ఎదుట భాజపా యువ మోర్చా కార్యకర్తలు నిరసనకు దిగారు. రెచ్చిపోయిన నిరసనకారులు కేజ్రీవాల్ నివాసం వెలుపల సీసీటీవీ కెమెరాలు, బారికేడ్లు ధ్వంసం చేసినట్టు 'ఆప్' ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. 

కేజ్రీవాల్ ఏమన్నారు?

 దిల్లీ న‌గ‌ర ప‌రిధిలోని సినిమా హాళ్లలో ప్రదర్శిస్తోన్న 'ద క‌శ్మీర్ ఫైల్స్' సినిమాకు వినోదపు ప‌న్ను రాయితీ క‌ల్పించాల‌ని భాజపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కోరారు. దీనిపై స్పందించిన అర‌వింద్ కేజ్రీవాల్‌ కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్న రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

" ఈ సినిమాను యూట్యూబ్‌లో పెడితే అందరికీ అందుబాటులో వస్తుంది. ఉచితంగా చూడొచ్చు కదా? కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. భాజపా వాళ్లు మాత్రం సినిమా పోస్టర్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. పన్ను మినహాయింపు ఇవ్వడం కాదు.. వీలైతే ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయమని దర్శకుడికి చెప్పండి. దీంతో ప్రజలందరికీ ఈ సినిమా ఉచితంగా అందుబాటులో ఉంటుంది                                                           "
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం

Also Read: Pure EV Electric Scooter: రహదారిపై మంటల్లో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్- పెద్ద ప్రమాదమే ఇది!

Also Read: PAN-Aadhaar Linking: పాన్- ఆధార్ లింక్ చేయలేదా? మార్చి 31తో లాస్ట్, లేకపోతే భారీ ఫైన్!

Published at : 30 Mar 2022 05:26 PM (IST) Tags: BJP delhi The Kashmir Files Tejasvi Surya

సంబంధిత కథనాలు

Independence Day 2022 Wishes: మీ ఫ్రెండ్స్‌కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Independence Day 2022 Wishes: మీ ఫ్రెండ్స్‌కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?

Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు

India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?

India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?

Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూత, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూత, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

టాప్ స్టోరీస్

Gorantla Madhav: ఒరిజినల్ వీడియో నాదగ్గరే ఉంది! టీడీపీకి ఆ దమ్ముందా? వాళ్ల మార్ఫింగ్ వీడియోలిస్తా? - గోరంట్ల

Gorantla Madhav: ఒరిజినల్ వీడియో నాదగ్గరే ఉంది! టీడీపీకి ఆ దమ్ముందా? వాళ్ల మార్ఫింగ్ వీడియోలిస్తా? - గోరంట్ల

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Balakrishna Appreciates Bimbisara : బాబాయ్‌గా బాలకృష్ణ కోరిక అదే - దర్శకుడికి ఓపెన్ ఆఫర్

Pawan Kalyan Yatra : అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్

Pawan Kalyan Yatra :  అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ టూర్