అన్వేషించండి

Jammu Kashmir Elections: జమ్మూ కశ్మీర్ లో ఆప్ పోటీ- ఏడుగురితో తొలి జాబితా ప్రకటన

Aam Aadmi Party : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Jammu Kashmir Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ నెలకొంది. కాగా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అలాగే గులాం నబీ ఆజాద్ పార్టీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో తమ అభ్యర్థులను గెలిపించేందుకు ఇరు పార్టీలు పూర్తి స్థాయిలో ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు 13 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గులాం నబీ ఆజాద్‌ పార్టీ విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎన్నికల్లో పోటీ చేయనున్న గందర్‌బాల్ స్థానం కూడా ఉంది.  

పుల్వామా నుంచి ఫయాజ్ అహ్మద్ సోఫీకి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ ఇచ్చింది.  రాజ్‌పోరా నుండి ముద్దాసిర్ హసన్‌ను అభ్యర్థిగా నిలిపింది. దీంతో పాటు దేవ్‌సర్‌ నుంచి షేక్‌ ఫిదా హుస్సేన్‌ను పోటీకి దింపుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు డూరు అసెంబ్లీ నుంచి మొహ్సిన్ షఫ్కత్ మీర్‌కు టికెట్ ఇచ్చారు. కాగా, దోడా నుంచి మెహ్రాజ్ దీన్ మాలిక్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. దోడా వెస్ట్ అభ్యర్థిగా యాసిర్ షఫీ మట్టోను ప్రకటించారు. అంతేకాకుండా, బనిహాల్ నుంచి ముదస్సిర్ అజ్మత్ మీర్‌ను బరిలోకి దింపుతామని ప్రకటించారు.

ఆప్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా 
జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇది కాకుండా, ఢిల్లీ ముఖ్యమంత్రి సతీమణి సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ కూడా ఆప్ స్టార్ క్యాంపెయినర్‌లలో ఉన్నారు. ఈ నేతలంతా జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు.  

మూడు దశల్లో ఎన్నికలు 
జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన కార్యక్రమం ప్రకారం సెప్టెంబర్ 18న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, రెండో దశ ఎన్నికలు సెప్టెంబర్ 25న జరగనున్నాయి. అక్టోబర్ 1న మూడో దశ ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అభ్యర్థులందరికీ ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో ఈసారి 360 మోడల్ పోలింగ్ కేంద్రాలను నిర్మించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక్కడ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో జనరల్‌కు 74, ఎస్‌టీకి 9, ఎస్సీలకు 7 రిజర్వు చేయబడ్డాయి.

ఆర్థికల్ 370రద్దు తర్వాత తొలిసారి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 2024లో అనేక పార్టీలు పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పీడీపీ, బీజేపీ, గులాం నబీ ఆజాద్ పార్టీ డీపీఏపీ, అప్నీ పార్టీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Embed widget