News
News
X

వారంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల గుడ్‌ న్యూస్‌- డీఏపై నిర్ణయం వచ్చే అవకాశం!

త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్ చెప్పనుంది కేంద్రం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డీఏ, డీఆర్‌పై నిర్ణయం చెప్పనుంది.

FOLLOW US: 
Share:

కేంద్ర ఉద్యోగుల నిరీక్షణకు త్వరలోనే ఎండ్‌ కార్డ్ పడనుంది. ఏడో వేతన సంఘం కింద కరవు భత్యం, ద్రవ్యోల్బణ ఉపశమనాన్ని కలిగించే నిర్ణయానికి ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే నిర్ణయం ఉంటుందని జాతీయ మీడియా చెబుతోంది. డీఏ, డీఆర్ పై ఈ నిర్ణయం మార్చి 8 తర్వాత రావచ్చని అంచనా వేస్తున్నారు. అధికారికంగా ఎలాంటి తేదీ వెల్లడించకపోయినట్టికీ వారం పది రోజుల్లో మాత్రం గుడ్ చెబుతోందని మాత్రం తెలుస్తోంది. ఇప్పటికే ఈ అధికారిక ప్రకటన కోసం లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

ఎంత పెరుగుదల ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పెంపు జరిగితే కరవు భత్యం, ద్రవ్యోల్బణ ఉపశమనం 42 శాతానికి పెరుగుతాయి. అంటే ఉద్యోగుల జీతాలు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం డీఏ 38 శాతంగా ఉంది.

జూలై నుంచి అమల్లోకి చివరి పెంపు
ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్‌ను 2022 జూలైలో 34 నుంచి 38 శాతానికి పెంచారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు సమానంగా వేతనాలు పెరిగాయి. ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు ఈ పెంపు ఉంటుంది. ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఉద్యోగులకు ఈ అలవెన్స్ ఇస్తారు.

ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను కూడా నిర్ణయించవచ్చు.
డీఏతోపాటు హోలీ తర్వాత ఉద్యోగుల మూలవేతనం పెంచడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల మూలవేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెంచవచ్చు.

పాత పెన్షన్ స్కీమ్ ఎంచుకునే అవకాశం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం నుంచి పాత పెన్షన్ పథకాన్ని ఎంచుకునే అవకాశం కల్పించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ నోటిఫికేషన్ తేదీకి ముందు అంటే డిసెంబర్ 22, 2003 న ప్రకటన చేసి నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ 1972 ఇప్పుడు పాత పెన్షన్ స్కీమ్ 2021 లో చేరడానికి అవకాశం ఉంది.

Published at : 08 Mar 2023 08:12 AM (IST) Tags: 7th Pay Commission Employees DA Hike Dearness Allowance Pensioners

సంబంధిత కథనాలు

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Umesh Pal Case Verdict : యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు - ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో యూపీ కోర్టు తీర్పు

Umesh Pal Case Verdict :  యూపీ మాఫియా డాన్ అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు - ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో యూపీ కోర్టు తీర్పు

ఆధార్‌, బ్యాంక్ అకౌంట్ లింక్‌ చేయడంలో మిస్టేక్- వ్యక్తికి జైలు శిక్ష- ఇలాంటిది మీకూ జరగొచ్చు!

ఆధార్‌, బ్యాంక్ అకౌంట్ లింక్‌ చేయడంలో మిస్టేక్- వ్యక్తికి జైలు శిక్ష- ఇలాంటిది మీకూ జరగొచ్చు!

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!