అన్వేషించండి

26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు

26/11 దాడిని సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దాడితో పోల్చడంపై ఆర్‌వీఎస్ మణి మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్, ISI ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు. హిందూ ఉగ్రవాదం యూపీలో హయాంలో వచ్చిందన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దిగ్విజయ్ సింగ్ హిందూ ఉగ్రవాద కేసులను కనుగొనమని కోరారు.
  • మాలెగావ్ కేసు ముందే రాసిన స్క్రిప్ట్, పురోహిత్ అరెస్ట్ కుట్ర.
  • 26/11 కాంగ్రెస్-ఐఎస్‌ఐ మ్యాచ్ ఫిక్సింగ్, హిందూ దాడిగా చిత్రీకరణ.
  • ఇష్రత్ జహాన్ కేసు మోడీ, అమిత్ షాల లక్ష్యంగా మార్చబడింది.

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మాజీ అండర్ సెక్రటరీ రామస్వామి వెంకట సుబ్రమణి హిందూ ఉగ్రవాదం,  26/11 ఉగ్రదాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏఎన్ఐ కి ఇచ్చిన తన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. తాను హోం శాఖలో పనిచేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తనను హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను వెతకాలని కోరారని ఆయన చెప్పారు. దేశంలో అలాంటి కేసులేవీ లేవని తనకు చెప్పినట్లు పేర్కొన్నారు.

హిందూ ఉగ్రవాదం ఫైల్స్ కోసం సెర్చ్ చేశాం.. 

స్మితా ప్రకాష్ ఓ పాడ్‌కాస్ట్‌లో ఆర్‌వీఎస్ మణి మాట్లాడుతూ.. ‘2010 వరకు ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్‌లో ఉన్నప్పుడు, ఏ ఫైల్‌లోనూ హిందూ ఉగ్రవాదం అనే పదం లేదు. జూన్ 2006లో హిందూ ఉగ్రవాదం కేసుల సమాచారాన్ని సేకరించాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. ఇప్పటివరకూ అలాంటి కేసులేవీ లేవని ఆయనకు చెప్పాను. మాలెగావ్ కేసు.. మొదటి రోజు నుంచే ఇది ఒక అబద్ధపు కేసు అని చెబుతూ వచ్చాను. ముందే రాసిన స్క్రిప్ట్ లాగా అనిపించింది. దాని ప్రకారమే సాధ్వి ప్రజ్ఞా, కల్నల్ పురోహిత్, మేజర్ ఉపాధ్యాయ్ లాంటి వారు పని చేశారు. 

 కల్నల్ పురోహిత్ నేడు జైలు బయట ఉండటం అద్భుతం అని చెప్పాలి. ఆయన అరెస్ట్ అనుకోకుండా చేసింది కాదు. దాని వెనుక ఒక కుట్ర దాగి ఉంది. 34 ఏళ్ల వయసులో ఆయన సెలెక్షన్ గ్రేడ్ లెఫ్టినెంట్ కల్నల్ కాగా, ఆయన ఆర్మీ చీఫ్ కాకున్నా.. కనీసం కోర్ కమాండర్ అయితే ఖచ్చితంగా అయ్యేవారు. ఆ స్థాయికి చేరుకోవడం పాకిస్తాన్ ప్రజలకు ఇష్టం లేదని’ అన్నారు.

ముంబై ఉగ్రదాడులపై సంచలన వ్యాఖ్యలు
ముంబైలో జరిగిన 26/11 దాడిని సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దాడితో పోల్చడంపై ఆర్‌వీఎస్ మణి స్పందించారు. ‘ఇది కాంగ్రెస్ పార్టీ, ISI ల మధ్య జరిగిన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల భారత్‌లో రాజకీయ నేతలకు ఏం లాభం చేకూరుతుంది? అంటే.. దీనిని కేవలం ఒక హిందూ దాడిగా చూపించడమే దాని ఉద్దేశం. కసబ్ చేతికి కూడా రక్షాబంధనం కట్టి ఉంచారు. ఒకవేళ తుకారాం ఓంబ్లే అతడిని పట్టుకోకపోయినా లేదా చంపకపోయినా, ఈ రోజు హిందూ ఉగ్రవాద దాడిగానే పరిగణించేవారు’అని సంచలన విషయాలు చెప్పారు.

Also Read: One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!

‘నా సీనియర్ అధికారులు ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసును రాజకీయ నాయకులు హత్య కేసుగా మార్చేశారు. నాకు సరిగ్గా గుర్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రమే లక్ష్యంగా ఉన్నారని’ మరోవైపు ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుపై వ్యాఖ్యానించారు. బియాంత్ సింగ్ హత్య కేసులో తాను భారత ప్రభుత్వానికి ఏకైక సాక్షినని తెలిపారు. జాతీయ భద్రత పరంగా ముఖ్యమైన అంశం ఏంటంటే.. ప్రధాని మోదీ వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. కానీ సురక్షిత భారత్ అని కూడా ప్రకటించాలని’ తాను భావిస్తున్నట్లు ఆర్‌వీఎస్ మణి పేర్కొన్నారు.

Frequently Asked Questions

దిగ్విజయ్ సింగ్, మాజీ అండర్ సెక్రటరీ రామస్వామి వెంకట సుబ్రమణిని దేని గురించి కోరారు?

దిగ్విజయ్ సింగ్, హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను వెతకాలని రామస్వామి వెంకట సుబ్రమణిని కోరారు. అయితే, అలాంటి కేసులేవీ లేవని సుబ్రమణి తెలిపారు. 2010 వరకు హోం శాఖ ఫైళ్లలో ఈ పదం లేదు.

మాలెగావ్ కేసు గురించి ఆర్‌వీఎస్ మణి ఏమని వ్యాఖ్యానించారు?

మాలెగావ్ కేసు మొదటి రోజు నుంచే ఒక అబద్ధపు కేసు అని ఆర్‌వీఎస్ మణి పేర్కొన్నారు. అది ముందే రాసిన స్క్రిప్ట్ లాగా అనిపించిందని, కల్నల్ పురోహిత్ అరెస్ట్ వెనుక కుట్ర ఉందని ఆయన అన్నారు.

26/11 ముంబై ఉగ్రదాడుల గురించి ఆర్‌వీఎస్ మణి చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటి?

26/11 ముంబై ఉగ్రదాడి కాంగ్రెస్ పార్టీ, ఐఎస్‌ఐల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ అని మణి అన్నారు. దీనిని ఒక హిందూ దాడిగా చూపించడమే వారి ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుపై ఆర్‌వీఎస్ మణి అభిప్రాయం ఏమిటి?

ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసును రాజకీయ నాయకులు హత్య కేసుగా మార్చారని మణి తెలిపారు. అప్పటి ప్రధాని మోదీ, అమిత్ షా మాత్రమే లక్ష్యంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget