2002 Gujarat Riots: ఆ కేసులో మోదీకి క్లీన్ చిట్‌ను సమర్థించిన సుప్రీం కోర్టు
2002 Gujarat Riots: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీ సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో సహా 64 మందికి సిట్ ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ క్లీన్ చిట్‌ను సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ఈ పిటిషన్ వేశారు.
Conspiracy cannot be readily inferred merely on the basis of the inaction or failure of the State administration. Inaction or failure of some officials of cannot be the basis to infer a pre-planned criminal conspiracy : #SupremeCourt in #ZakiaJafri's plea in #GujaratRiots case pic.twitter.com/avnJPqv0eZ
— Live Law (@LiveLawIndia) June 24, 2022
ఎవరీ జాఫ్రీ?
అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని గుల్బర్గా సొసైటీలో హత్యకు గురైన 69 మందిలో పిటిషనర్ జాకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. అయితే దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తూ జాకియా, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ తీస్తా సేతల్వాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సుప్రీం సమర్థత
అయితే ఈ ఆరోపణలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. 2021 డిసెంబర్ 9న ఈ తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా శుక్రవారం తీర్పును వెలువరించింది. సిట్ నిర్ణయాన్ని సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు 2017లోనే ఈ కేసును కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలనే సుప్రీం సమర్థించింది.
ఇదీ జరిగింది
2002లో గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీలు దగ్ధమై.. 59 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం.. గుజరాత్లో మత ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిట్ మోదీ క్లీన్ చిట్ ఇచ్చింది.
Also Read: Maharashtra Political Crisis: 'పవార్‌నే బెదిరిస్తారా? ఇక బలపరీక్షలోనే తేల్చుకుంటాం- దమ్ముంటే రండి'