Vijay divas : కార్గిల్ వార్‌లో రవీనాటాండన్ మిస్సైల్..! నేరుగా నవాజ్ గుండెల్లోకే...
1999 కార్గిల్ వార్‌లో రవీనాటాండన్ పేరుతో ఉన్న మిస్సైళ్లను పాకిస్తాన్‌పై వదిలిన మిగ్ ఫైటర్లు. అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు రవీనా ఫేవరేట్ యాక్టర్.
కార్గిల్‌లో భారత వీరుల అద్భుత విజయాన్ని దేశం మొత్తం మరోసారి స్మరించుకుంది. ఇదే సమయంలో మరో విషయమూ నెటిజన్లలో హైలెట్ అయింది. అదేమిటంటే... రవీనాటాండన్ - నవాజ్ షరీఫ్ లవ్ స్టోరీ. అయితే ఇది సినిమా టైప్ లవ్ స్టోరీ కాదు. వార్ లవ్ స్టోరీ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కార్గిల్ యుద్ధ సమయంలో.. భారత యుద్ధ విమానాల్లో ఎక్కువగా మిగ్ ఫైటర్లు ఉండేవి. మిగ్ ఫైటర్లు పెద్ద ఎత్తున మిస్సైళ్లను తీసుకెళ్లి కార్గిల్‌లో చొరబడిన పాక్ సైనికులపై వేసి వచ్చేవి. అలా వారిపై పడిన మిస్సైళ్లలో కొన్నింటిపై రవీనాటాండన్ పేరు ఉంది. మిగ్ -27 నుంచి జారవిడిచిన అనేక మిస్సైళ్లపై ఈ పేరు ఉంది. ఒక్క రవీనా పేరు మాత్రమే లేదు.. రవీనా టాండన్ టూ నవాజ్ షరీఫ్ అని అడ్రస్ రాశారు.
మిస్సైళ్లపై రవీనా టాండన్ టూ నవాజ్ షరీఫ్ ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోతారు. దీనికి చిన్న కథ ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా నవాజ్ షరీఫ్ ఉన్నారు. ఈ కుట్రకు ప్రధాన కారణంగా పర్వేజ్ ముషారఫ్ అయినప్పటికీ.. షరీఫ్ కూడా పాత్రధారుడే. అయితే షరీఫ్‌కు.. రవీనాటాండర్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ రోజుల్లో రవీనా టాడంన్ కుర్రకారు డ్రీమ్ గర్ల్. ఒక్క ఇండియా యువతకే.. కాదు.. పాకిస్థాన్‌లోని పెద్దవాళ్లకు కూడా రవీనా అంటే.. పచ్చి చచ్చిపోయేవాళ్లు. వారిలో నవాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఆయనతన ఇష్టాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. పలు సందర్భాల్లో ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే యుద్ధసమయంలో పాకిస్తాన్ పీఎంగా ఉన్న నవాజ్ షరీఫ్‌కు రవీనా టాండన్ ఫేవరేట్ పేరు మీద మిస్సైళ్లు పంపించారు.
ఈ ఫొటోలు విజయ్ దివస్ సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జోర్ కా జట్కా.. ధీరే సే లగే.. అని రాసి ఉన్న బాంబు ఫొటో కూడా వైరల్ అయ్యింది. ఈ ఫోటోలు ప్రతీ సంవత్సరం వైరల్ అవుతూనే ఉంటాయి. రవీనాటాండర్ కూడా వీటిపై స్పందించింది. గొడవలకు.. యుద్ధాలకు తాను వ్యతిరేకం అయినా... అలా రాయడం తనకు గర్వకారణమేనని చెప్పుకొచ్చారు. తన తండ్రి గొప్ప దేశభక్తుడని.. సైన్యంలో పని చేశారని చెప్పుకున్నారు. పాకిస్థాన్ పాలకులు.. ప్రజలు ఇండియాను ఎంతగా ద్వేషించినా.. వారికి బాలీవుడ్ సినిమాలు.. బాలీవుడ్ నటులు అంటే ప్రాణం. అక్కడి సినిమా ధియేటర్లు బాలీవుడ్ సినిమాలతోనే హౌస్ ఫుల్స్ అవుతాయి. టీవీ చానళ్లలో ఇండియన్ సీరియల్సే చూస్తారు. అయితే ఇటీవలి కాలంలో వాటిపై ఎక్కువగా ఆంక్షలు పెట్టింది ఇమ్రాన్ ఖాన్ సర్కార్. అయినప్పటికీ.. ఈ టెక్ ప్రపంచంలో వాటిని చూడటానికి పాకిస్థానీయులు అనేక మార్గాలను ఎంచుకున్నారు. చూస్తున్నారు. ఇప్పుడు ఇమ్రాన్‌ఖాన్‌కు కూడా డ్రీమ్ గర్ల్స్ ఇండియన్ హీరోయిన్సే. అయితే ఆయన బయటకు చెప్పుకోలేరు అంతే.