అన్వేషించండి

BRICS: చైనాకు భారత్ చెక్.. బ్రిక్స్​ సమావేశంలో ఇదే వ్యూహం!​

బ్రిక్స్​ అంటే ఏంటి? అసలు ఈ సమావేశంలో ప్రధాన అజెండా ఏంటి? ఈసారి జరగనున్న బ్రిక్స్​ సమావేశంలో భారత్​-చైనా సరిహద్దు వివాదం తెరపైకి వస్తుందా? చైనాకు చెక్​ పెట్టేందుకు భారత్​ సిద్ధమైందా?

భారత్​, చైనా.. ఆసియాలోనే కాక ప్రపంచంలోనే రెండు పెద్ద దేశాలు. ఆర్థికంగా, సైనిక శక్తిలో వీటి శక్తిసామర్థ్యాలు అంతా ఇంతా కాదు. అయితే ఏడాదిగా ఇరు దేశాల మధ్య గల్వాన్ ఘర్షణతో యుద్ధ వాతావరణం నెలకొంది. ద్వైపాక్షిక సంబంధాలు కూడా క్షీణించాయి. ఈ సమయంలో జరగనున్న బ్రిక్స్​ సమావేశంపై ఈ ప్రభావం ఉంటుందా? ఆసియాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న చైనాకు భారత్ చెక్​ పెట్టనుందా?

బ్రిక్స్ (BRICS) అనేది అభివృద్ధి చెందుతున్న ఐదు ప్రపంచ దేశాల కూటమి.

బ్రిటన్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఇందులోని సభ్య దేశాలు. ఈ ఐదు దేశాల ఆర్థిక వ్యవస్థల ఆధారంగా ఈ కూటమి ఏర్పడింది.

ప్రపంచ జనాభాలో 44 శాతం బ్రిక్స్ దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జీడీపీలో 30 శాతం, వాణిజ్యంలో 18 శాతం బ్రిక్స్ దేశాల నుంచే వస్తోంది.

ఎందుకీ మీటింగ్..?

ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలకు చెందిన దేశాధినేతలు పాల్గొంటారు. 2009 నుంచి బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో కలుస్తున్నాయి.

చివరి మీటింగ్ ఎక్కడ..?

2020లో జరిగిన 12వ బ్రిక్స్​ సమావేశానికి రష్యా అధ్యక్షత వహించింది. కరోనా కారణంగా వర్చువల్​గా ఈ సమావేశం జరిగింది.

ఈసారి భారత్​లోనే..

ఈ ఏడాది జరిగే 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించనుంది. ఈ సమావేశాన్ని భారత్‌లోనే నిర్వహిస్తారు. మూడవసారి భారత్​ బ్రిక్స్​ సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2012, 2016లో ఈ సమావేశాలు భారత్​లోనే జరిగాయి.

భారత్​ అజెండా ఏంటి?

సాధారణంగా ఐదు సభ్య దేశాలకు ప్రయోజనకరమైన విషయాలను ఈ సదస్సులో ప్రస్తావిస్తారు. అయితే బ్రిక్స్​ దేశాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని భారత్​ ఆకాక్షిస్తుంది. కొవిడ్-19 సంక్షోభాన్ని సభ్యదేశాలన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆశిస్తుంది.

అంతర్జాతీయ, ప్రాంతీయ భద్రతా, రాజకీయ అంశాలపై బ్రిక్స్​ దేశాలు స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలని భారత్​ కోరుతోంది.

భారత్​-చైనా ఘర్షణ ప్రభావం..

ఇటీవల చెలరేగిన సరిహద్దు వివాదం, గల్వాన్​ ఘర్షణతో క్షీణించిన భారత్​-చైనా సంబంధాలు బ్రిక్స్ సమావేశంపై ప్రభావం చూపనున్నాయి. అయితే ఇరుదేశాల సంబంధాల పునరుద్ధరణకు బ్రిక్స్​ సమావేశం సహాయపడనుంది.

ఆసియాలో ఆధిపత్యానికి ఆరాడపడుతున్న చైనాకు గల్వాన్​లో భారత్​ గట్టి బదులిచ్చింది. భారత్​ను కాదని ఆసియాలో వ్యాపారాన్ని విస్తరించడం చైనాకు పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే భారత్​లో చైనాకు పెద్ద మార్కెట్​ ఉంది. అందుకే భారత్​తో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదని చైనా భావిస్తుంది. అందుకే ఈ ఏడాది భారత్​లో జరిగే బ్రిక్స్​ సమావేశానికి డ్రాగన్ ఎలాంటి అడ్డుచెప్పలేదు. సరిహద్దు వివాదంపై బ్రిక్స్​ సమావేశంలో చైనా అడ్డగోలు మాటలు మాట్లాడితే గట్టిగా బదులిచ్చేందుకు భారత్​ సిద్ధమైనట్లు తెలుస్తోంది.  
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సభ్య దేశాల అధినేతలు ఈ ఏడాది చివరిలో భారత్​లో జరిగే సమావేశానికి వస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే వర్చువల్​గా జరిగే అవకాశమే ఎక్కువ  ఉంది.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు..

2020 బ్రిక్స్​ సమావేశంలో ప్రస్తావించిన ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్ కట్టుబడి ఉంది. అయితే ఇందుకోసం సరైన కార్యాచరణపై ఈ ఏడాది భేటీలో చర్చించనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Nani Or Naga Chaitanya: శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
Embed widget