By: Ram Manohar | Updated at : 09 Apr 2023 01:28 PM (IST)
ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Kolkata Under Water Metro:
ట్రయల్ రన్
1984లో భారత్‌లో తొలి మెట్రో సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి రైల్వే శాఖలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్నో కొత్త ట్రైన్ సర్వీస్‌లు స్టార్ట్ అయ్యాయి. కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లూ పట్టాలెక్కాయి. ఇప్పుడు మరో అతి పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని తొలిసారి అండర్ వాటర్ మెట్రో ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సర్వీస్‌లు మొదలు కానున్నట్టు గతంలోనే రైల్వే మంత్రి ప్రకటించారు. దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోగా ఇది రికార్డు సృష్టిస్తుందని స్పష్టం చేశారు. ఇదో ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిపోతుందని వెల్లడించారు. హుగ్లీ నది కింద ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే...అండర్ వాటర్ టన్నెల్‌లో 6 కోచ్‌లున్న రెండు మెట్రో ట్రైన్‌లను ఈ రోజు (ఏప్రిల్ 9) న టెస్ట్ రన్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కోల్‌కత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ అండర్‌వాటర్ మెట్రోను ఈస్ట్-వెస్ట్ కారిడర్ ప్రాజెక్టుగా వ్యవహరిస్తున్నారు. సాల్ట్ లేక్ నుంచి హౌరా వరకూ ఈ మెట్రో సర్వీస్‌లు ఉంటాయి. వయా హౌరా ఇది దూసుకుపోతుంది. నిజానికి ఇప్పటికే ఈ పనులు పూర్తవ్వాల్సి ఉంది. కానీ మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. టన్నెల్ నిర్మాణం కారణంగా నదీ పరిసరాల్లోని ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని టెక్నికల్ సమస్యలూ రావడం వల్ల పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. ప్రజలు ఆందోళనకు గురి కావడం వల్ల కొద్ది రోజుల పాటు పనులు నిలిపివేశారు.
కిలోమీటర్‌కు రూ.157కోట్లు..
ఎప్సలాండే నుంచి హౌరా మైదాన్ వరకూ దాదాపు 4.8 కిలోమీటర్ల మేర ఈ మెట్రో ట్రైన్‌ల టెస్ట్ రన్ చేసేందుకు ప్లాన్ చేశారు అధికారులు. తొలిసారి 1984లో మెట్రో కోల్‌కత్తాలోని ప్రారంభమైంది. అండర్ వాటర్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడే మొదలవుతుండటం ఆసక్తికరంగా మారింది. సెక్టార్ V నుంచి సీల్దా మధ్య సెక్షన్ ఇప్పటికే ఆపరేషన్‌కు రెడీగా ఉంది. అయితే సీల్దా నుంచి ఎప్సలాండే మార్గంలో పనులు ఇంకా పూర్తి కాలేదు. 2019 నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. కానీ ట్రయల్ రన్ నేపథ్యంలో ప్రస్తుతం టెంపరరీ ట్రాక్స్ వేస్తున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. ప్రజలకు ఎప్పుడు ఇవి అందుబాటులోకి వస్తాయన్నది ఇంకా అధికారికంగా చెప్పలేదు. ట్రయల్ రన్ సక్సెస్ అయిన తరవాత పరిస్థితులను బట్టి ఆ తేదీలు ప్రకటించే అవకాశముంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. విదేశాల్లో ఇలాంటి అండర్ వాటర్ ప్రాజెక్ట్ ఉంది. లండన్, పారిస్‌ను కలుపుతూ ఈ ట్రైన్ అందుబాటులో ఉంది. ఈ అండర్ వాటర్ మెట్రో నిర్మాణానికి కిలోమీటర్‌కి రూ.157 కోట్ల ఖర్చైనట్టు అధికారులు స్పష్టం చేశారు.
Also Read: US Visa Hike: స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ పెంచిన అమెరికా, అప్పటి నుంచే అమల్లోకి
APJAC Protest: సీపీఎస్ రద్దు హామీకి అతీ గతీ లేదు, డిమాండ్లు పరిష్కరించమనడం తప్పా?: బొప్పరాజు సూటిప్రశ్న
Hayathnagar Death Case: హయత్ నగర్లో కుళ్లిన శవం: గవర్నమెంట్ టీచర్ భర్తే యువకుణ్ని హత్య చేశాడా?
RBI Fake Notes : రూ. 500 నోట్లలో ఫేక్ చాలా ఎక్కువట - ఆర్బీఐ చెప్పిన సంచలన విషయాలు ఇవిగో
తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Warangal: వరంగల్‌లో బాలుడి అమ్మకం కలకలం, కొడుకును అమ్మేసిన కన్న తండ్రి
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం