Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 18 వేల మందికి వైరస్
Corona Cases: దేశంలో కొత్తగా 18,313 కరోనా కేసులు నమోదయ్యాయి. 57 మంది మృతి చెందారు.
Corona Cases: దేశంలో క్రితం రోజుతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా 18,313 కరోనా కేసులు నమోదయ్యాయి. 57 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి తాజాగా 20,742 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.
#COVID19 | India reports 18,313 fresh cases, 20,742 recoveries and 57 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 27, 2022
Active cases 1,45,026
Daily positivity rate 4.31% pic.twitter.com/LEWYIOj8qR
- మొత్తం కేసులు : 4,39,38,764
- మొత్తం మరణాలు: 5,26,167
- యాక్టివ్ కేసులు: 1,45,026
- మొత్తం రికవరీలు: 4,32,67,571
వ్యాక్సినేషన్
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) July 27, 2022
➡️ India’s Cumulative #COVID19 Vaccination Coverage exceeds 202.79 Cr (2,02,79,61,722).
➡️ Over 3.86 Cr 1st dose vaccines administered for age group 12-14 years.https://t.co/MWhk09MXnM #Unite2FightCorona pic.twitter.com/jTVSV9GJ7v
దేశంలో కొత్తగా 27,37,235 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,02,79,61,722 కోట్లు దాటింది. మరో 4,25,337 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Delhi Police: దొంగల్ని ఇలా గుర్తించండి, దిల్లీ పోలీసులు చెప్పిన పాఠం విన్నారా?