(Source: ECI/ABP News/ABP Majha)
Corona Cases: కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా? 22 వేలకు చేరువలో కొత్త కేసులు
Corona Cases: దేశంలో కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయి. 60 మంది మృతి చెందారు.
Corona Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 21,880 కరోనా కేసులు నమోదయ్యాయి. 60 మంది మృతి చెందారు. తాజాగా 21,219 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.46 శాతానికి చేరింది.
India records 21,880 new Covid19 cases and 60 deaths in the last 24 hours; Active cases at 1,49,482 pic.twitter.com/HCE6x3uNiW
— ANI (@ANI) July 22, 2022
- మొత్తం కేసులు : 4,38,47,065
- మొత్తం మరణాలు: 5,25,930
- యాక్టివ్ కేసులు: 1,49,482
- మొత్తం రికవరీలు: 4,31,71,653
వ్యాక్సినేషన్
#𝐂𝐎𝐕𝐈𝐃𝟏𝟗 𝐕𝐚𝐜𝐜𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐔𝐏𝐃𝐀𝐓𝐄#AmritMahotsav
— Ministry of Health (@MoHFW_INDIA) July 22, 2022
➡️ More than 193.70 Cr vaccine doses provided to States/UTs.
➡️ More than 8.07 Cr doses still available with States/UTs to be administered.https://t.co/KYsLHmEd9g pic.twitter.com/pamcJ2dbp7
దేశంలో కొత్తగా 37,06,997 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 201.30 కోట్లు దాటింది. మరో 4,95,359 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కరోనా పోరాటంలో కొత్త రికార్డును భారత్ అందుకుంది. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.
Also Read: Draupadi Murmu Profile: ద్రౌపది ముర్ము ఘనవిజయం- రాష్ట్రపతి పీఠంపై తొలి గిరిజన మహిళ
Also Read: Droupadi Murmu: గిరిజనులకు అతి పెద్ద అండ దొరికినట్టే, ద్రౌపది విజయంతో ఆ వర్గాల ఆనందం