చేతనైతే ముందు మీ దేశాన్ని చక్కబెట్టుకోండి, పాక్‌కి వార్నింగ్ ఇచ్చిన భారత్
J&K Issue At UNGA: ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్‌కి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
J&K Issue At UNGA:
యూఎన్‌జీఏలో మాటల యుద్ధం..
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA)లో భారత్, పాక్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. పదేపదే జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తి ఇండియాపై ఆరోపణలు చేస్తున్న పాక్‌కి భారత్ గట్టిగానే బదులిస్తోంది. పాకిస్థాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్వాహ్ ఉల్ హక్ కకర్ జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై ఇండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ముందు మీ దేశం పరిస్థితులు చక్కబెట్టుకోండి అంటూ తేల్చి చెప్పింది. పాక్‌లో మైనార్టీలపై జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలని హితవు పలికింది. ముఖ్యంగా మహిళలు, క్రిస్టియన్‌లపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని మండిపడింది. ఇలాంటి ఆరోపణలు చేయడం పాకిస్థాన్‌కి ఓ అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ విద్వేష ప్రచారం చేస్తోందని విమర్శించింది. భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ (Petal Gahlot) ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ముందు ఆ సంగతి చూడాలని వార్నింగ్ ఇచ్చారు.
"పాక్‌కి భారత్‌పై విషం కక్కడం అలవాటైపోయింది. విలువైన సమయాన్ని భారత్‌పై విద్వేష ప్రచారాలు చేయడంతోనే వృథా చేసుకుంటోంది. పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న విషయం ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థలకు బాగా తెలుసు. జమ్ముకశ్మీర్ అనేది ఎప్పటికీ భారత్ అంతర్గత విషయం. ఈ అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం చేసుకోడానికి వీల్లేదు. ఆ దేశంలో మైనార్టీలు, మహిళలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌వైపు వేలు చూపించే ముందు పాక్ తన దేశ పరిస్థితులను చక్కబెట్టుకుంటే మంచిది"
- పెటల్ గహ్లోట్, భారత ప్రతినిధి
#WATCH | First Secretary at United Nations for 2nd Committee of UNGA, Petal Gahlot says "Pakistan has become a habitual offender when it comes to misusing this August forum to peddle baseless and malicious propaganda against India. Member states of the United Nations and other… pic.twitter.com/eIyynFFa1Q
— ANI (@ANI) September 23, 2023
భారత్ ఓ వైపు చంద్రుడిని చేరుకుంటే, మరోవైపు పాకిస్తాన్ ప్రపంచం ముందు అడుక్కుతింటోందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. భారత్ G20 సమ్మిట్‌ని నిర్వహించిందని, ప్రస్తుతం భారత్‌లో 600 బిలియన్ డాలర్ల ట్రెజరీ ఉందని అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్.. చైనా, అరబ్ దేశాలు సహా ప్రపంచం నలుమూలల నుంచి 1-1 బిలియన్ డాలర్లను యాచిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో వారి ముందు మనం ఏం తలెత్తుకోగలమని అన్నట్లుగా పాకిస్తాన్ మీడియా కథనాలు రాసింది. నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌కు ఈ స్థితికి రావడానికి కారణమైన వారు దేశంలోని అతిపెద్ద నేరస్థులు. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పిడిఎం) ప్రభుత్వం దేశాన్ని డిఫాల్ట్ నుంచి రక్షించింది. లేదంటే దేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.వెయ్యికి చేరుకునేది. దేశం ప్రస్తుత ఈ పరిస్థితికి రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్, మాజీ చీఫ్ జస్టిస్ మియాన్ సాకిబ్ నిసార్ బాధ్యులు’’ అని నవాజ్ షరీఫ్ ఆరోపించారు.
Also Read: చిన్న పిల్లాడిపైనా మీ ప్రతాపం, ఇదేం కొత్త కాదుగా - సనాతన ధర్మం వివాదంపై కమల్ కామెంట్స్