India China Standoff: డ్రాగన్ వంకర బుద్ధి.. అమల్లోకి కొత్త సరిహద్దు చట్టం.. భారత్‌పై ఎఫెక్ట్!
చైనా మరో ఎత్తుగడ వేసింది. నూతన సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తేనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
భారత్- చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు నెలకొన్న వేళ డ్రాగన్ కొత్త ఎత్తుగడకు తెరలేపింది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో కొత్త సరిహద్దు చట్టాన్ని రూపొందించింది. చైనా జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సభ్యుల సమావేశంలో ఈ చట్టానికి ఆమోదం తెలిపింది డ్రాగన్. 2022 జనవరి 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది.
చట్టంలో ఏముంది?
సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు చైనా ఈ చట్టంలో పేర్కొంది. సరిహద్దులో చైనా ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహిస్తామని డ్రాగన్ చట్టంలో పేర్కొంది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకుంటామని వెల్లడించింది.
భారత్‌పై ప్రభావం..
ఈ చట్టంతో భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటీవల తూర్పు లద్దాఖ్ వద్ద చైనా- భారత్ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇలాంటి చట్టాలతో డ్రాగన్ ముందుకు వెళితే గల్వాన్ వంటి ఘర్షణలు మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
భూటాన్‌తో..
12 పొరుగు దేశాలతో చైనా సరిహద్దును నిర్ణయించుకుంది. కానీ భారత్, భూటాన్‌తో మాత్రం చైనాకు ఇప్పటికీ సరైన సరిహద్దు లేదు. భారత్‌తో 3,488 కిమీ, భూటాన్‌తో 400 కిమీ మేర సరిహద్దు వివాదాస్పదంగా ఉంది.
చర్చలు విఫలం..
సరిహద్దులో శాంతి సామరస్యాలు నెలకొల్పడం కోసం భారత్- చైనా మధ్య ఇప్పటికే పలు మార్లు సైనిక స్థాయిలో చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలన్నీ విఫలమయ్యాయి. శాంతి కోసం భారత్ చేసిన ప్రతిపాదనలను చైనా తిరస్కరించింది. చైనాతో చర్చలు విఫలమైనట్లు భారత్ సైన్యం కూడా ఇటీవల పేర్కొంది. అయితే వారితో చర్చలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
Also Read: Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి