India China Clash: గల్వాన్ అయినా తవాంగ్ అయినా మన సైన్యానిదే పైచేయి, దమ్మేంటో చూపించారు - రాజ్‌నాథ్ సింగ్
India China Clash: ఎక్కడ చైనాతో ఘర్షణ జరిగినా భారత్ బలంగా బదులిచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.
India China Clash:
ఎదురు నిలిచిన భారత్ సైన్యం..
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్వాన్‌లోనే అయినా, తవాంగ్‌లో అయినా భారత సైన్యం తమ ధైర్యసాహసాలతో శత్రు సైన్యాన్ని ఎదుర్కొందని ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "గల్వాన్ అయినా తవాంగ్ అయినా మన భారత సైన్యం మాత్రం చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలిచింది. ధైర్య సాహసాలు చూపింది" అని కొనియాడారు. ఇదే సమయంలో భారత్, చైనా ఆర్థిక వ్యవస్థల్ని పోల్చి చెబుతూ భారత్ బలంగా ఉందన్న విషయాన్ని తేల్చి చెప్పారు. "1949లో భారత్ జీడీపీ చైనా కన్నా తక్కువ. 1980 వరకూ ప్రపంచంలోనే టాప్-10 ఆర్థిక వ్యవస్థల జాబితాలోనూ భారత్ లేదు. 2014లో భారత్ 9వ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు 3.5 లక్షల కోట్ల ఎకానమీతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది" అని స్పష్టం చేశారు రాజ్‌నాథ్ సింగ్. చైనాతో జరుగుతున్న ఘర్షణలపై అడుగుతున్న ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వడం లేదన్న ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనిపైనా రాజ్‌నాథ్ స్పందించారు. "ప్రతిపక్షాల ఉద్దేశాలను, వారి అభిప్రాయాలను మేమెప్పుడూ ప్రశ్నించలేదు. విధానాల ఆధారంగానే మా వాదనలేంటో వినిపిస్తాం. నిజాలు మాట్లాడటమే మా రాజకీయం" అని వెల్లడించారు. భారత్- చైనా సైనికుల మధ్య అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల ఘర్షణ జరిగింది.
డిసెంబర్ 9న భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించగా.. డ్రాగన్ చర్యను భారత బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని మోదీ సర్కార్ తెలిపింది.
Whether it is Galwan or Tawang, our defence forces have proved their bravery and valour: Defence Minister Rajnath Singh, in Delhi pic.twitter.com/vZqqfS37I3
— ANI (@ANI) December 17, 2022
In 1949, China's GDP was lower than that of India. Until 1980, India was not even in the list of top 10 economies... In 2014, India was on the 9th position in world economies. Today India is close to a $3.5 trillion economy & is 5th largest in the world: Defence Minister pic.twitter.com/wEtWGnCYCq
— ANI (@ANI) December 17, 2022
Also Read: India China Border Clash: తవాంగ్‌లో చైనా ఎందుకు తగవుకు దిగింది? ఇరు దేశాలకు ఈ ప్రాంతం అంత వ్యూహాత్మకమా?