దేశం సంక్షోభంలో ఉంటే మీకు ఫారిన్ టూర్‌లు అవసరమా? బిలావల్‌పై ఇమ్రాన్ ఆగ్రహం
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బిలావల్ భుట్టోపై మండి పడ్డారు.
Imran Khan Slams Bilawal:
ఓ ర్యాలీలో విమర్శలు
పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఇటీవలే భారత్ పర్యటనకు వచ్చారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO Summit) సదస్సుకి హాజరయ్యారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఉగ్రవాదంపై కీలక చర్చలు జరిపారు. క్రాస్ బార్డర్ టెర్రరిజంపై పాక్ కచ్చితంగా దృష్టి సారించాలని తేల్చి చెప్పారు జైశంకర్. ఉగ్రవాదాన్ని అణిచివేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే..దాదాపు 12 ఏళ్ల తరవాత పాక్‌కు చెందిన మంత్రి భారత్‌కు రావడం ఆసక్తికరంగా మారింది. దీనిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. బిలావల్ భుట్టోతో పాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పైనా విమర్శలు చేశారు. దేశం సంక్షోభంలో కూరుకుపోయి ఉంటే ఇలాంటి కష్టకాలంలో ఫారిన్ ట్రిప్‌లు అవసరమా అని మండి పడ్డారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లండన్ వెళ్లారు. అక్కడ కింగ్ ఛార్లెస్ పట్టాభిషేక కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిపైనా కౌంటర్‌లు ఇచ్చారు ఇమ్రాన్. ఇక్కడ ప్రజలు అల్లాడిపోతుంటే దేశాలు పట్టుకుని తిరుగుతారా అని ప్రశ్నించారు. ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన...ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్‌ను కించ పరుస్తున్నాయి. ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో విదేశీ పర్యటనలేంటి? మిస్టర్ బిలావల్ భుట్టో మీరు ప్రపంచమంతా టూర్‌లు వేస్తున్నారు. కానీ మాకు ముందు ఓ సమాధానం చెప్పండి. దేశ ఖజానాలోని డబ్బుతో మీరిలా పర్యటించే హక్కు ఎక్కడిది..? దీని వల్ల ఏమైనా ఉపయోగముందా. ఈ పర్యటనతో ఏం లాభం వచ్చిందో చెప్పాలి"
- ఇమ్రాన్ ఖాన్, పాక్ మాజీ ప్రధాని
జైశంకర్ వార్నింగ్..
శుక్రవారం జరిగిన SCO విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి హాజరైన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీని జై శంకర్.. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేసి స్వాగతం పలికారు. కాగా.. సమావేశం ప్రారంభానికి ముందు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి మన దేశ విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తేతో స్వాగతం పలికారు. గడిచిన 12 ఏళ్లలో భారత్‌ను సందర్భించిన మొట్టమొదటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా బిలావల్ భుట్టో జర్దారీ గుర్తింపు పొందారు. జమ్మూ కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదంతో సహా అనేక సమస్యలపై రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొనసాగుతున్న ఒత్తిడి మధ్య పాక్ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని జైశంకర్ ఈ వేదికపై మరోసారి స్పష్టంచేశారు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న సంస్థలపై నిఘా పెట్టాలని తేల్చి చెప్పారు.
"ఉగ్రవాద ముప్పు నిరంతరం కొనసాగుతోంది. ఉగ్రవాదానికి ఎటువంటి సమర్థింపు ఉండకూడదు. సమర్థించకపోవడమే కాదు, సీమాంతర ఉగ్రవాదంతోపాటు అన్ని రూపాల నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలి. ఎస్సీవో ఉద్దేశాల్లో ఉగ్రవాదం ముఖ్యమైనదని మళ్లీ గుర్తు చేస్తున్నాను"
- ఎస్.జై శంకర్, విదేశాంగమంత్రి
Also Read: నిద్రలో ఉండగానే ముంచెత్తిన వరదలు,గుర్తు పట్టలేని స్థితిలో శవాలు