అన్వేషించండి

యుద్ధమే కోరుకుంటే మీ ఖర్మ, టెర్రరిస్టులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్

టెర్రరిస్టులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువులు యుద్ధమే కోరుకుంటే...చివరకు వారి పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

టెర్రరిస్టులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువులు యుద్ధమే కోరుకుంటే... చివరకు వారి పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇండియా శత్రువులు తమ దేశ పురోగతిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇది సరికొత్త భారత్‌ అన్న ఆయన, బెదిరింపులకు భయపడేదిలేదని, వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అనేక యుద్ధాలను చూసిన భారత్‌, వాటిని కోరుకోవడం లేదన్నారు. ఎవరైనా యుద్ధాన్నే కోరుకుంటే మాత్రం తాము వెనుకంజ వేయబోమన్నారు. తాము యుద్ధం చేస్తే... శత్రువులు వారి పిల్లల్ని ఇతరులు పెంచాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చించారు. తమ సైన్యం వద్ద అత్యాధునిక సాంకేతికత, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలున్నాయని... ఈ విషయాన్ని శత్రువులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 

జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. 5 రోజులుగా ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌  కొనసాగుతూనే ఉంది. కొండ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులను  ఏరివేత కోసం ఆర్మీ ముమ్మరంగా విరామం లేకుండా శ్రమిస్తోంది.  అత్యాధునిక డ్రోన్‌ వ్యవస్థను రంగంలోకి దించింది. గఢాల్‌ అడవుల్లోని పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని కచ్చితంగా కనిపెట్టేందుకు సైన్యం డ్రోన్లను రంగంలోకి దించింది. డ్రోన్లతో చేసిన సర్వే ఆధారంగా తీవ్రవాదులు దాక్కొన్న ప్రాంతంపై సైన్యం మోర్టార్‌ షెల్స్‌తో దాడి చేస్తోంది. ఈ ప్రాంతంలో జరిగిన న్‌కౌంటర్‌లోనే కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, మేజర్‌ ఆశిష్‌ ధోనక్‌, డీఎస్పీ హుమాయున్‌ భట్‌, రాష్ట్రీయ రైఫిల్‌ సైనికుడు రవికుమార్‌ మృతి చెందారు. 

కొకెర్‌నాగ్‌ సమీపంలో మొదలైన ఎన్‌కౌంటర్లో అధికారుల విషాదగాథలు వెలుగులోకి వస్తున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో తాను బతకనన్న విషయం  డీఎస్పీ హుమయూన్ అర్థమైపోయింది. హుమయూన్‌ భట్‌ తుదిశ్వాస విడవడానికి ముందు.. గాయాలతోనే తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. తొలుత తన తండ్రి, రిటైర్డ్‌ ఐజీ గులాం హసన్‌ భట్‌ తో మాట్లాడారు. తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని కుటుంబసభ్యులకు చెప్పారు. 

ఉరి సెక్టార్‌లోనూ భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో...సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరి మృతదేహాలను సైన్యం స్వాధీనం చేసుకున్నారు.  మూడో ముష్కరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో... పాకిస్తాన్ వైపు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఇండియన్ ఆర్మీలోని కొందరు సైనికులకు గాయాలయ్యాయి. 

పీర్‌పంజాల్‌ పర్వత శ్రేణులు ఉన్న పూంచ్‌, రాజౌరీల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగాయి. పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటుకొని వచ్చిన ఉగ్రవాదులు,  శ్రీనగర్‌ లేదా డోడా వెళ్లాలన్నా అనంతనాగ్‌ మీదుగానే ప్రయాణించాలి. దీంతో ఉగ్రవాదులకు ఇది ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. కశ్మీర్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పీర్‌ పంజాల్‌ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి. బనిహాల్‌, హాజిపీర్‌, పీర్‌పంజాల్‌ పాస్‌లు అత్యంత కీలకం.  15 వేల అడుగుల ఎత్తుండే...ఈ పర్వతశ్రేణుల సైనిక అపరేషన్ల చేపట్టాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. 
Also Read: వేరే మతాల గురించి అలా మాట్లాడే ధైర్యముందా? ఉదయనిధి స్టాలిన్‌ని నిలదీసిన నిర్మలా సీతారామన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget