అన్వేషించండి

పుంగనూరులో పారిశ్రామికవేత్త ఇంటిపై అర్థరాత్రి దాడి - తాగుబోతులంటున్న పోలీసులు

ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణం కొత్తిండ్లు ఎల్‌ఐసీ కాలనీలో ఉన్న రాామచంద్ర యాదవ్‌ ఇంటికి వెళ్లి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో ఫర్నిచర్‌, వాహనాలు ధ్వంసం చేశారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి జరిగింది. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీ చేశారు. నియోజకవర్గంలో రైతు సమస్యలపై రైతు భేరీ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. 

సభకు వెళ్లకుండా రాచంద్రయాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు సాయంత్రం ఐదున్నర గంటలకు వదిలేశారు. తర్వాత తన అనుచరరులతో కలిసి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి క్షీరాభిషేకం చేశారు. తర్వాత అనుచరులంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. అనంతరం రామచంద్రయాదవ్‌ ఇంటిపై దాడి జరిగింది. ఇది చేసింది వైసీపీ కార్యకర్తలేనంటూ ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. రైతుల సమస్యలపై సభ తలపెట్టామని.. దీన్ని జీర్ణించుకోలేకే తమ ఇంటిపై దాడి చేశారని ఆయన అనుచరులు విమర్శిస్తున్‌నారు. 

ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణం కొత్తిండ్లు ఎల్‌ఐసీ కాలనీలో ఉన్న ఇంటికి వెళ్లి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో తలుపులు, అద్దాలు పగలకొట్టి లోపలకు వెళ్లి, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. పార్క్ చేసి ఉన్న కార్లు, బైక్‌లపై విరుచుకపడ్డారు. ఈ దుర్ఘటనలో ఆరు కార్లు, మరిన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. 

అదే ఇంట్లో ఉన్న తను తన ఫ్యామిలీ ఓ గదిలో దాక్కొని ప్రాణాలతో బయట పడ్డామంటున్నారు రామచంద్రయాదవ్. తమ నాయకుడు సదుం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఇంత దాడి జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఆయన సన్నిహితులు. సుమారు 200 మంది వచ్చి దాడి చేశారని చెబుతున్నారు. 

వచ్చిన వాళ్లంతా తాళాలు పగలగొట్టి... ఇంట్లోకి ప్రవేశించారు. సుమారు అరగంట పాటు వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని రామచంద్రయాదవ్ అనుచరులు ఆరోపిస్తున్నారు. వచ్చిన వారిని బతిమలాడి పంపిస్తున్నారే తప్ప దాడి చేస్తున్న వారిపై సీరియస్‌గా రియాక్ట్ కాలేదంటున్నారు. 

రామచంద్రయాదవ్ అనుచరుల ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. కొందరు వ్యక్తులు మద్యం మత్తులో రామచంద్ర యాదవ్‌ ఇంటిపై దాడి చేశారని చెప్పారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నామన్నారు. ఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్టు వివరించారు. దీనిపై ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అందుకే కేసు రిజిస్టర్ చేయలేదని వివరిస్తున్నారు. 

తమపై వస్తున్న ఆరోపణలను వైసీపీ లీడర్‌లు ఖండిస్తున్నారు. రాత్రికి రాత్రే ఎదగాలని అనుకుంటున్న రామచంద్ర యాదవ్... ఇలాంటి పన్నాగాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ దాడిపై వైసీపీ లీడర్లు అనుమాం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

karnataka Hanuman Chalisa Incident | హనుమాన్ చాలీసా పెడితే కొట్టిన ముస్లిం యువకులు, తిరగబడిన తేజస్వీIPL Matches Schedule Algorithm | CSK vs RCB మధ్య మొదటి మ్యాచ్ ఎందుకో తెలుసా.? | ABP DesamInimel Lokesh Kanagaraj | డైరెక్టర్ ని యాక్టర్ గా మార్చిన Kamal Haasan | ABP DesamFather of Mulugu DSP | జాతీయ పక్షిని వేటాడిన పోలీస్ తండ్రి.. ఎక్కడంటే..!  | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Telangana Governor: బుధవారం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
Jagan Tour : ఇడుపుల పాయ నుంచి  ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం బస్సు యాత్ర - జగన్ ప్రచారం ఖరారు !
BCCI: జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
జాక్‌పాట్‌ కొట్టిన సర్ఫరాజ్‌, జురెల్‌
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Brothers As DGPs: దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌లో రికార్డు.. రెండు రాష్ట్రాల‌కు డీజీపీలుగా అన్న‌ద‌మ్ములు
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Iswarya Menon Photos:  పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Iswarya Menon Photos: పింక్ శారీలో ఐశ్వర్య మీనన్ ని చూస్తే రెప్పవేయడం మర్చిపోతారంతే!
Embed widget