(Source: ECI/ABP News/ABP Majha)
Simla Tensions : సిమ్లాలో మత రాజకీయ ఉద్రిక్తతలు - మసీదు నిర్మాణంపై ఆందోళనలు - హిమచల్‌లో ఏం జరుగుతోంది ?
Himachal Pradesh : సిమ్లాలో ఓ మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారని హిందూ సంస్థలు చేసిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ అంశం రాజకీయంగానూ పెను ప్రకంపనలకు కారణం అవుతోంది.
Shimla mosque Politics : పర్యాటక రంగానికి స్వర్గధామంగా ఉన్న సిమ్లా ఇప్పుడు వేరే కారణాలతో ప్రచారంలోకి వస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మతపరమైన అంమశాలతో అక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం సిమ్లాలో చేపడుతున్న ఓ మసీదు నిర్మాణం అక్రమం అని. హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
Massive Protests in Shimla, Himachal Pradesh over illegal mosque....
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 11, 2024
Locals in no mood to surrender to demographic changes and land jihad!
One of biggest demonstration in Shimla!
Lathicharge by police. Public break barricades, move towards illegal mosque pic.twitter.com/F9qf3XI381
సిమ్లా శివారులో వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్న ఓ స్థలంలో పాత మసీదు ఉంది. నిజానికి ఆ సంస్థ కోర్టు వివాదాల్లో ఉంది. పధ్నాలుగేళ్లుగా న్యాయవివాదాల్లో ఉన్న ఆ స్థలంలో ఎలాంటి అదనపు నిర్మాణాలు చేయవద్దని కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయితే ఒక అంతస్తు ఉన్న ఆ మసీదు నిర్మాణానికి ఐదు అంతస్తులు కట్టేశారు. ఐదు అంతస్తల వరకూ శ్లాబ్స్ వేసి.. ఇతర నిర్మాణాలు చేస్తూండటంతో హిందూ సంఘాలు ఆందోలనకు దిగాయి. సిమ్లాలో అంత పెద్ద మసీదును నిర్మించడం చట్ట విరుద్దమని.. ఉద్దేశపూర్వకంగా సిమ్లా డెమెగ్రాఫిక్ ఔన్నత్యన్ని చెడగొట్టేలా నిర్మాణాలు చేస్తున్నారని..వెంటనే అక్రమ నిర్మాలను కూలగొట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాహుల్ గాంధీకి పెళ్లంట - మరోసారి ఊగిపోతున్న సోషల్ మీడియా ! వధువు ఎవరో తెలుసా ?
ఈ మసీదు వ్యవహారం కొంత కాలంగా కలకలం రేపుతోంది. అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి ఒకరు ఈ సమీదు నిర్మాణం అక్రమమేనని స్పష్టం చేశారు. ఆ అంశం కోర్టులో ఉందని తెలిపారు. అయితే అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నా సరే హిమాచల్ ప్రభుత్వం పట్టించుకోవం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో మసీదుకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలు.. ఘర్షణలకు దారి తీశాయి.
కస్టమర్ జాక్ పాట్ కొడితే రూ. వెయ్యి చేతిలో పెట్టారు - క్రెడ్ కంపెనీ తీరుపై నెటిజన్ల విమర్శలు
హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవలి కాలంలో ముస్లిం జనాభా పెరుగుతోంది. హిందువుల జనాభా పెరుగుదల శాతం పదమూడు ఉండగా.. ముస్లింల జనాభా పెరుగుదల శాతం ముఫ్పై దాటిపోయింది. అదే సమయంలో మసీదల అక్రమ నిర్మాణాల అంశం హిందూ వర్గాల్లో అలజడికి కారణం అవుతోంది. అయితే హిమాచల్ ప్రదేశ్ హిందువులే మెజార్టీలు. ఆ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది హిందువులు ఉండగా.. లక్షన్నర మంత్రి మాత్రమే ముస్లింలు న్నారు. ఆ తర్వాత వరుసగా సిక్కులు, క్రిస్టియన్లు ఉన్నారు. అయితే అనూహ్యంగా ముస్లింల సంఖ్య పెరుగుతూండటం.. ఆ స్థాయిలో హిందువుల సంఖ్య పెరగకపోవడంతో పాటు మసీదుల నిర్మాణాలను జోరుగా చేపట్టడం ఉద్రిక్తలకు కారణం అవుతోంది.