Cred : కస్టమర్ జాక్ పాట్ కొడితే రూ. వెయ్యి చేతిలో పెట్టారు - క్రెడ్ కంపెనీ తీరుపై నెటిజన్ల విమర్శలు
Jackpot : క్రెడిట్ కార్డులు, ఇతర బిల్లులు చెల్లించే యాప్ క్రెడ్ లో ఓ గేమ్ ఆడిన యూజర్ జాక్ పాట్ కొట్టాడు. మూడున్నర లక్షల ఐ ఫోన్ ఉత్పత్తులు వస్తాయనుకున్నాడు. కానీ అతనికి వెయ్యి మాత్రమే ఇచ్చారు.
Man Wins 3 Lakh Jackpot on CRED Company Hands Him Rs 1K : ఎవరైనా ఏదైనా పోటీలో గెలుపొందితే వచ్చే ఆనందమే వేరు. కష్టపడి సంపాదిచిన దాని కంటే ఇలా గెలుచుకుంటే ఎక్కువ మంది సంతోషిస్తారు. ఇలా ఓ వ్యక్తి క్రెడ్ యాప్ లో ఫ్రైట్ జాక్ పాట్ అనే పోటీలో పాల్గొన్నాడు. అనూహ్యంగా అతను జాక్ పాట్ కొట్టాడు. అలా కొట్టినందుకు అతనికి మ్యాక్ బుక్
ఐ ప్యాడ్, ఎయిర్ ప్యాడ్స్ మ్యాక్స్, టుమి బ్యాగ్ వస్తాయని కంపెనీ నుంచి సమాచారం వచ్చింది. అలాగే తనపాన్ డీటైల్స్ కూడా తీసుకున్నారు. ఆ వస్తువులు వస్తాయని ఎదురు చూస్తున్న ఆ వ్యక్తికి.. కేవలం రూ. వెయ్యి అంటే వెయ్యి రూపాయలు అకౌంట్‌లో జమ చేసి.. టెక్నికల్ గ్లిచ్ వల్ల.. మీకు జాక్ పాట్ వచ్చిందని దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పుకచ్చారు. దీంతో మ్యాక్ బుక్ తో పాటు ఇతర వస్తువులు వస్తాయని గాల్లో తేలిపోతున్న అతడు.. సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఈ అంశంపై నెటిజన్లు క్రెడ్ కంపెనీపై వ్యతిరేకంగా స్పందించడం ప్రారంభించారు. జాక్ పాట్ కొట్టిన కస్టమర్ కు .. చెప్పిన విధంగా బహుమతులు ఇవ్వాల్సిందేనని వారంటున్నారు. అయితే ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రెడ్ .. జాక్ పాట్ కొట్టిన అవిరాల్ సింఘాల్ అనే యువకుడ్ని పదే పదే సంప్రదించింది . జాక్ పాట్ అంటే.. ఒక్కరికే రావాలని కాని.. తమ యార్ లో ఉన్న ఓ బగ్ వల్ల.. రెండు వందల మంది జాక్ పాట్ కొట్టారని చెప్పుకొచ్చారు. అందుకే తలా రూ. వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నామని.. సర్ది చెప్పే ప్రయత్న చేశారు. కానీ అవిరాల్ సింఘాల్ మాత్రం మెత్తబడలేదు.. క్రెడ్ కంపెనీ తనను మోసం చేసిందని వాదిస్తూనే ఉన్నారు.
Even though I usually do not fall for the @CRED_club jackpots, but yesterday I just played the friday jackpot without having any hope of getting anything meaningful. But I scored the JACKPOT and it wasn't a small one. It included a Macbook, Ipad, Airpods Max and a TUMI bag worth… pic.twitter.com/16SwhchMYm
— Aviral Sangal (@sangalaviral) September 7, 2024
క్రెడ్ ఎన్ని చెప్పినా తాను వెనక్కి తగ్గేది లేదని లీగల్ ఆప్షన్స్ కూడా చూస్తానని సింఘాల్ బెదిరించడం ప్రారంభించారు. సింఘాల్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మిలియన్ల మంది చూస్తున్నారు. నిజంగా రెండు వందల మందికి బగ్ వల్ల జాక్ పాట్ వచ్చినట్లయితే.. వారి వివరాలను బయట పెట్టాలని నెటిజన్లు కొంత మంది డిమాండ్ చేశారు.
They are correct when they are saying its a technical glitch, coz their programs are designed in the way that noone can win the jackpot. 😜
— Atul (@atulrathod123) September 9, 2024
Cred jackpot is nothing but a fraud.
క్రెడ్ యాప్ .. అత్యంత ఎక్కువ పబ్లిసిటీతో దూసుకు వచ్చింది. ముందుగా క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపును సులభతరం చేసింది. తర్వాత చార్జిలు వసూలు చేయడం ప్రారంభించింది. తర్వాత వివిధ రకాల సేవలకు విస్తరించింది. మొత్తంగా క్రెడ్ కు ఈ జాక్ పాట్ ద్వారా నెగెటివ్ పబ్లిసిటీ ప్రారంభమయింది.