Principal English Viral: 'Saven Harendra' 7వందలకు వచ్చిన తిప్పలు - చెక్ మీద రాసింది కూడా స్కూల్ ప్రిన్సిపల్ !
School Principal: హిమాచల్ ప్రదేశ్ స్కూల్ ప్రిన్సిపల్ ఒకరు ఓ వ్యక్తికి చెక్ ఇచ్చాడు. కానీ ఆ చెక్ బౌన్స్ అయింది. ఎందుకంటే ఆ ఇంగ్లిష్ ఆ క్యాషియర్‌కు అర్థం కాలేదు.

School Principal Cheque It Gets Bounced: టీచర్ అంటే చదువు నేర్పుతారు. ప్రిన్సిపల్ అంటే ఆ టీచర్ల కంటే కూడా ఎక్కువ తెలిసిన వాళ్లు ఉండాలి. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఓ ప్రిన్సిపల్ చెక్ రాశారు. దానిపై ఉన్న ఇంగ్లిష్ చూసి చివరికి ఆ బ్యాంక్ క్యాషియర్ కూడా దాన్ని బౌన్స్ చేసేశారు. తిప్పి పంపేశారు. ఈ చెక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ చేతి రాతతో ఉన్న చెక్, దానిలోని తప్పుడు స్పెల్లింగ్ తప్పుల కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ చెక్‌ను బ్యాంక్ తిరస్కరించిన తర్వాత నెట్‌లో లీక్ అయింది. ఈ సంఘటన ఉపాధ్యాయుల సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తింది.
Himachal Pradesh government has been sending teachers on costly foreign trips, expecting fresh ideas to improve schools. Yet in Sirmaur, a cheque signed by Ronhat school principal exposed far more about education than any overseas tour. pic.twitter.com/TPT7GFMBhd
— Krishna Chaudhary (@KrishnaTOI) September 29, 2025
సెప్టెంబర్ 25 తేదీన ఈ చెక్ రాసినట్లుగా ఉంది. ఈ చెక్, మిడ్-డే మీల్ వర్కర్ అట్టర్ సింగ్ పేరున రూ. 7,616 కోసం జారీ చేశారు. అయితే, ఈ చెక్‌లో ఉన్న తప్పులు వైరల్ గా మారాయి. చెక్‌లో 'సెవెన్' (seven)ను 'సావెన్' (saven)గా, 'థౌజండ్' (thousand)ను 'థర్స్‌డే' (Thursday)గా, 'హండ్రడ్' (hundred)ను 'హరేంద్ర' (harendra)గా రాశారు. అంతేగాక, 'సిక్స్‌టీన్' (sixteen)ను 'సిక్స్‌టీ' (sixty)గా రాశారు.
ఈ చెక్‌ను ప్రిన్సిపల్ స్వయంగా రాశారో లేదో స్పష్టం కాలేదు. అయినప్పటికీ, ఈ తప్పులు ఉపాధ్యాయుల సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తాయి. సోషల్ మీడియాలో "ఇది ఉపాధ్యాయుల స్థితి. ఇందుకే ఎవరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన మా వంటి వారికి ఇది చాలా విచారకరం. అయితే, ప్రతిచోటా సిస్టమ్స్ మారుతున్నాయి, స్కూళ్లు మాత్రం ఎందుకు మారకూడదు?" అని ప్రశ్నిస్తున్నారు.
A cheque signed by a govt school principal in Himachal Pradesh has gone viral for its spelling errors, with people on social media turning it into a laughing stock. The cheque, dated September 25, was reportedly issued to a mid-day worker but was rejected by the bank due to the… pic.twitter.com/RaJKAoSHhf
— DNA (@dna) September 30, 2025
కొందరు సోషల్ మీడియా వినియోగదారులు రిజర్వేషన్ సిస్టమ్‌ను బ్లేమ్ చేస్తూ, టాప్ పొజిషన్లకు మెరిట్ బేస్డ్ సిస్టమ్ అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి టీచర్ల పాఠాలు నేర్పుతూంటే పిల్లలకు చదువులు ఎలా వస్తాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.





















