Heroin Seized In Kolkata: కోల్‌కతాలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్!
Heroin Seized In Kolkata: కోల్‌కతాలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Heroin Seized In Kolkata: బంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ డ్రగ్ రాకెట్ బయటపడింది. దాదాపు రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్ ఈ ఆపరేషన్‌లో లభ్యమైంది.
ఇదీ జరిగింది
గుజరాత్ పోలీసుల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. కోల్‌కతాలో రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్‌ను ఈ టీం స్వాధీనం చేసుకుంది. కోల్‌కతా పోర్టుకు స్క్రాప్ కంటైనర్‌లో 40 కిలోల డ్రగ్స్‌ను తీసుకొచ్చారు. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
దిల్లీలో
మరొ భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఈ నెల 5న దిల్లీ పోలీసులు ఛేదించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్ ఉంది. దీంతోపాటు 10 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మాదకద్రవ్యాల దందాను విదేశీయులు నడిపిస్తున్నట్లు గుర్తించారు.
అఫ్గానిస్థాన్‌కు చెందిన ముస్తాఫా స్టానిక్జా (23), రహీముల్లా రహీమ్ (44).. 2016 నుంచి భారత్‌లో ఉంటున్నారు. అప్పటి నుంచే డ్రగ్స్ రాకెట్‌ను నడిపిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. విదేశాల్లో తయారుచేసిన ఈ మెథ్‌ను దిల్లీకి తీసుకువస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో దిల్లీలోని కాలిందికుంజ్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో డ్రగ్స్ తరలిస్తోన్న ఆ ట్రక్‌ను స్వాధీనం చేసుకొని పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Ahmednagar Bogus Doctor: అయ్య బాబోయ్- 40 మందికి పశువుల ఇంజెక్షన్ ఇచ్చేసిన బెండు అప్పారావు!
Also Read: RBI on Loan Apps: లోన్ యాప్‌లపై కేంద్రం సీరియస్- RBIకు కీలక ఆదేశాలు!