అన్వేషించండి

Maharashtra Heavy Rain:మహారాష్ట్రలో వర్షాల బీభత్సం..... విరిగిపడిన కొండచరియలు...

మహారాష్ట్రలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పలు ప్రాంతాలను వరదలతో ముంచెత్తాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్‌ జిల్లాలోని మహడ్‌ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి.

మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.  ముఖ్యంగా కొంకణ్ ప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది. భారీ వర్షాల ధాటికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రహిస్తున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మరోవైపు కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

Maharashtra Heavy Rain:మహారాష్ట్రలో వర్షాల బీభత్సం..... విరిగిపడిన కొండచరియలు...

రాయ్‌గఢ్‌ జిల్లాలోని తలై గ్రామంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 30 మందికి పైగా శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. రహదారిపైకి భారీగా వరదనీరు రావడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు రాయ్‌గఢ్‌ కలెక్టర్‌ తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ముంబయి-గోవా, ముంబయి-నాసిక్‌ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆ మార్గాల్లో వేలాది వాహనాలు బారులు తీరాయి.

Maharashtra Heavy Rain:మహారాష్ట్రలో వర్షాల బీభత్సం..... విరిగిపడిన కొండచరియలు...

సాయంత్రం సమయంలో అందరూ ఇళ్లల్లో ఉన్న సమయంలో కొండ చరియలు విరిగిపడడంతో చాలా మంది వాటి కింద చిక్కుకుపోయారు. ఇప్పటికే పలువురు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐతే మట్టి పెళ్లల కింద ఖచ్చితంగా ఎంత మంది చిక్కకున్నారన్న వివరాలు తెలియడం లేదు. దాదాపు 75 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

Maharashtra Heavy Rain:మహారాష్ట్రలో వర్షాల బీభత్సం..... విరిగిపడిన కొండచరియలు...
 గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో నాలుగు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కొల్హాపూర్‌ జిల్లాలోని 47 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Maharashtra Heavy Rain:మహారాష్ట్రలో వర్షాల బీభత్సం..... విరిగిపడిన కొండచరియలు...

మహారాష్ట్రలో రత్నగిరి, రాయగఢ్, థానే, పాల్‌ఘర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఓ వైపు వరదలు, మరోవైపు విరిగిపడుతున్న కొండ చరియలతో జనం వణికిపోతున్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నేవీ, ఆర్మీ సాయం కోరింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, కోస్ట్ గార్డ్ దళాలు మోహరించాయి. హెలికాప్టర్లు, పడవల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో వర్షాల పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వరద సహాయక చర్యల్లో కేంద్రం తరపున అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Maharashtra Heavy Rain:మహారాష్ట్రలో వర్షాల బీభత్సం..... విరిగిపడిన కొండచరియలు...

భారీ వర్షాల కారణంగా రత్నగిరి జిల్లాలో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. తీర గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరింది. కనీసం 27 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఠాణె, పాల్ఘర్‌, సింధుదుర్గ్‌, కొల్హాపూర్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో అక్కడి ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాల సంబంధిత ఘటనల్లో పాల్ఘర్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Maharashtra Heavy Rain:మహారాష్ట్రలో వర్షాల బీభత్సం..... విరిగిపడిన కొండచరియలు...

వాణిజ్య రాజధాని ముంబయిలోని గోవండి ప్రాంతంలో వర్షాల కారణంగా ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget