అన్వేషించండి

Top Headlines Today: సజ్జల రామకృష్ణా రెడ్డికి పోలీసులు నోటీసులు! మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు - నేటి టాప్ న్యూస్

Andhra Pradesh News Today | ఏపీలో స్కిల్ స్కామ్ కేసు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణలో హైడ్రా చర్యలపై పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రజలకు అండగా ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు.

ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మూసీ ప్రాజెక్టుతో పాటు హైడ్రా చర్యలపై పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది. హైదరాబాద్‌లోని హైడ్రా, మూసీ బాధితులకు అండగా ఉంటామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమై బాధితుల పక్షాన పోరాటానికి ఉద్యమకార్యాచరణపై చర్చించారు. బీఆర్ఎస్ నేతలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్‌లో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. పేదలకు ఎవరూ అండగా లేరన్నట్లుగా హైడ్రాతో పాటు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోందని విమర్శిచారు.  పూర్తి వివరాలు

సజ్జల రామకృష్ణా రెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు, విచారణకు రావాలని ఆదేశాలు
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఇన్ని రోజులు వైసీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విచారిస్తూ వచ్చిన పోలీసులు ఇప్పుడు కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక వ్యక్తిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు(గురువారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.  పూర్తి వివరాలు


స్కిల్ కేసులో చంద్రబాబు పాత్రపై లభించని ఆధారాలు - ఈడీ తాజా ప్రకటన సారాంశం ఏమిటంటే ?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా కొన్ని సంస్థల ఆస్తులు జప్తు చేసింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ స్టేట్‌మెంట్‌లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావన లేదు.  స్కిల్  కేసు అంటే అందరికీ అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు అరెస్టే గుర్తుకు వస్తుంది. ఆ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆరోపిస్తూ సీఐడీ కేసులు నమోదు చేసింది. చంద్రబాబుకు కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా ఓ అర్థరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారని ఆరోపణలున్నాయి. దాదాపు 50 మూడు రోజుల తర్వాత బెయిల్  రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. స్కి్ల్ స్కామ్ కేసులో ఒక్క రూపాయి అక్రమ లావాదేవీని సీఐడీ చూపించలేకపోయిందని బెయిల్ ఇచ్చిన సమయంలో హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు

ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ద్వారా పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ ను గ్రామ స్థాయిలో మరోసారి బలోపేతం చేయడానికి ఇందిరమ్మ కమిటీలను ఓ అవకాశంగా ఉపయోగించుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటును ప్రకటించారు. రాబోయే స్థానిక ఎన్నికల నాటికి గ్రామాలన్నింటిపై ఇందిరమ్మ కమిటీల ప్రభావం ఉండేలా చూసుకునేందుకు ప్లాన్ చేశారు. అంటే.. ప్రతి ప్రభుత్వ లబ్దిదారుడు కాంగ్రెస్ పార్టీని దాటిపోలేడు. అంతే కాదు ఇతర కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లనూ చేజారిపోకుండా చూసుకోవచ్చు. పూర్తి వివరాలు

రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
ఏపీలో రెండో విడత నామినేటెడ్ పోస్టుల(Nominated Posts In AP) భర్తీకి రంగం సిద్ధమైంది. తొలి దఫాలో ఇప్పటికే 20 కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను నియమించారు. వీటిలో టిడిపి నుంచి 16 మంది, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి ఛాన్స్ ఇచ్చారు. కొనకళ్ళ నారాయణ, పీతల సుజాత, దీపక్ రెడ్డి, రవి నాయుడు లాంటి వాళ్లకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి. పూర్తి వివరాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Embed widget