Afghanistan Taliban Rule: భయం గుప్పిట్లో ప్రజలు.. కళ్లు చమర్చే చిత్రాలు
అఫ్గానిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా తాలిబన్ల భయంతో పరుగులు తీస్తున్న ప్రజలే కనిపిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం ప్రజలతో కిక్కిరిసిపోయింది.
తాలిబన్లు అఫ్గానిస్థాన్ ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయి. వివిధ దేశాలు కాబూల్ లో తమ రాయబార కార్యాలయాలను మూసి వేస్తున్నాయి. తాలిబన్ల క్రూర పాలన నేపథ్యంలో చాలా మంది అఫ్గాన్ వాసులు సైతం ఇతర దేశాలకు వలస వెళ్లడానికి కాబూల్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ఎయిర్ పోర్టుకు తరలివెళ్తున్నారు. అక్కడ విమానాలను ఇష్టారాజ్యంగా ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. అయితే వీరు కాల్పుల వల్ల చనిపోయారో లేక తొక్కిసలాటలో మరణించారో స్పష్టత లేదు.
కాబూల్ విమానాశ్రయంలో ప్రజలు పడిగాపులు కాస్తున్న చిత్రాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రన్ వే పైనా, విమానంలోనూ అఫ్గాన్ వాసులు ఎదురుచూస్తున్నారు.
చైనా స్నేహహస్తం..
దేశం విడిచిన ఘనీ..
తాలిబన్లు రాజధాని నగరం కాబూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, అఫ్గానిస్థాన్ లో యుద్ధం ముగిసిందని ప్రకటించిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రక్తపాతాన్ని నివారించాలని కోరుతూ ఆదివారం దేశం విడిచి పారిపోయారు. రక్తపాతాన్ని నివారించడానికి తాను అఫ్గానిస్థాన్ వదిలి వెళుతున్నట్లుగా ఘనీ ప్రకటించిన తర్వాత పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి. కాబూల్ ఎయిర్ పోర్ట్ లో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన, ఐదుగురు మృతి ఘటన ఆ దేశంలో తాజా పరిణామాలకు అద్దం పడుతున్నాయి. ఇక ఈ ఉద్రిక్తతలు మరెంత తీవ్ర పరిణామాలకు కారణం అవుతాయో అన్న ఆందోళన కొనసాగుతుంది.
తాలిబాన్లు రాజధాని నగరం కాబూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసిందని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రక్తపాతాన్ని నివారించాలని కోరుతూ ఆదివారం దేశం విడిచి పారిపోయారు. రక్తపాతాన్ని నివారించడానికి తాను ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళుతున్నట్లుగా ఘనీ ప్రకటన చేసినా ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి. కాబూల్ ఎయిర్ పోర్ట్ లో ప్రస్తుతం చోటు చేసుకున్న ఆందోళన, ఐదుగురు మృతి ఘటన ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలకు అద్దం పడుతున్నాయి. ఇక ఈ ఉద్రిక్తతలు మరెంత తీవ్ర పరిణామాలకు కారణం అవుతాయో అన్న ఆందోళన కొనసాగుతుంది.