By: Ram Manohar | Updated at : 12 Jan 2023 02:21 PM (IST)
పానిపట్‌లో ఓ ఇంట్లో గ్యాస్ పేలి ఆరుగురు మృతి చెందారు. (Image Credits: ANI)
Haryana Cylinder Blast:
పానిపట్‌లో ప్రమాదం..
హరియాణాలోని పానిపట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీళ్లు వెస్ట్‌బెంగాల్ నుంచి వలస వచ్చి పానిపట్‌లో నివసిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల్లోదంపతులతో పాటు నలుగురు చిన్నారులున్నారు. ఈ దంపతులు స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఇంట్లో నుంచి ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు రావడం వల్ల స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే వాళ్లు కాలి బూడిదైపోయారు.
"ప్రాథమిక విచారణ ఆధారంగా చూస్తే..గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా పేలుడు సంభవించింది. టీ చేసుకునేందుకు గ్యాస్ ఆన్ చేశారు. అప్పుడే సిలిండర్ పేలింది. ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు. కచ్చితంగా ఏ కారణంతో చనిపోయారన్నది పోస్ట్ మార్ట్ రిపోర్ట్ వస్తే కానీ చెప్పలేం"
- పానిపట్ డీఎస్పీ
Haryana | As per the initial investigation an explosion happened due to a gas cylinder leakage. When a family member lit fire to make tea, an explosion took place. Six members died due to suffocation. Post-mortem report will clarify the cause of death: DSP D Kharab, Panipat pic.twitter.com/h3DodHSsO8
— ANI (@ANI) January 12, 2023
గతేడాది బిహార్‌లో..
గతేడాది డిసెంబర్లో బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుకల బట్టీలోని చిమ్నీ పేలడు కారణంగా 9 మంది కూలీలు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రామ్‌గర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతిహరిలోని ఇటుకల బట్టీలో ఈ ప్రమాదం సంభవించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద మొత్తంలో పొగ లోపలకి వెళ్లడం వల్ల శ్వాస తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. దాదాపు 8 మంది తీవ్రంగా గాయపడగా..వారందరికీ వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చనిపోయయిన వారిలో ఇటుకల బట్టీ యజమాని కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై...ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ ఆర్థిక సహకారం అందించనున్నట్టు చెప్పారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: User Names In Twitter: ట్విటర్ యూజర్ నేమ్స్ ఫర్ సేల్, ఆన్లైన్లో వేలం పెడతారట!
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు