Gujarat Polls 2022: రవీంద్ర జడేజా భార్యకు భాజపా టికెట్- మరి ప్రచారం చేస్తాడా?
Gujarat Polls 2022: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు భాజపా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
Gujarat Polls 2022: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ విధానసభ స్థానం టికెట్ ఆమెకు ఇచ్చింది. రివాబా 2019లోనే భాజపాలో చేరారు.
జామ్‌నగర్ నార్త్ గుజరాత్ అసెంబ్లీ సీటును భాజపా.. అంతకుముందు ధర్మేంద్రసింగ్ జడేజాకు ఇచ్చింది. రివాబా 2016లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. ఆమె మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆమె కాంగ్రెస్ నాయకుడు హరిసింగ్ సోలంకీకి బంధువు.
Cricketer Ravindrasinh Jadeja's wife Rivaba Jadeja to contest from Jamnagar North constituency.#GujaratAssemblyPolls pic.twitter.com/mbZGPgXJP8
— ANI (@ANI) November 10, 2022
జాబితా విడుదల
రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా తమ అభ్యర్థులను గురువారం ప్రకటించింది. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 160 మంది అభ్యర్థులను భాజపా ప్రకటించింది. భాజపా అభ్యర్థుల జాబితాలో 38 కొత్త ముఖాలు ఉన్నాయి. 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇచ్చారు.
భాజపా అభ్యర్థుల జాబితాలోని ఇతర ప్రముఖుల్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన నియోజకవర్గం ఘట్లోడియా నుంచి బరిలోకి దిగారు. విరామ్‌గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్‌కు భాజపా టికెట్ ఇచ్చింది.
ఇటీవల బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రజలను రక్షించేందుకు నదిలో దూకిన మోర్బీ మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృత్యను కూడా భాజపా రంగంలోకి దించింది.
ఎన్నికల షెడ్యూల్
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.
డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది.
2017లో
గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.
సర్వేలో
గుజరాత్ ఎన్నికలపై ABP News,C Voter Opinion Poll నిర్వహించింది.ఈ పోల్‌లో గుజరాత్‌లో మరోసారి భాజపా విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది భాజపా. ఇప్పుడు ఏడోసారి కూడా గెలుస్తుందని ఈ పోల్‌లో తేలింది.
మొత్తం గుజరాత్‌లో 182 స్థానాలు ఉన్నాయి. ఇందులో భాజపా 131-139 సీట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 31- 39 సీట్లు వస్తాయని, ఆప్ 7-15 సీట్లు మాత్రమే సాధించే అవకాశముందని వెల్లడించింది. ఇతరులకు 0-2 సీట్లు వచ్చే అవకాశమున్నట్లు తేలింది.
అయితే ఆప్ రేసులోకి రావడం వల్ల భాజపా, కాంగ్రెస్ ఓటు శాతం తగ్గిపోతుందని తెలిపింది. భాజపాకు 45.4%, కాంగ్రెస్‌కు 29.1%, ఆప్‌నకు 20.2%, ఇతరులకు 5.3% ఓట్లు దక్కుతాయని అంచనా వేసింది ABP News,C Voter Opinion Poll 2022.
Also Read: Viral Video: కదులుతున్న కారుపై కళ్లు చెదిరే స్టంట్- షాకిచ్చిన పోలీసులు!