Gujarat Assembly Elections 2022: 'ఆపరేషన్ గుజరాత్' పనిలో కేజ్రీవాల్ బిజీబిజీ- అప్పుడే అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా
Gujarat Assembly Elections 2022: ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కేజ్రీవాల్ విడుదల చేశారు.
Gujarat Assembly Elections 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆమ్‌ఆద్మీకి ఫుల్ జోష్ వచ్చింది. దీంతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత గడ్డ గుజరాత్‌లో జెండా ఎగరేయాలని కేజ్రీవాల్ తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఎప్పుడో కసరత్తు మొదలు పెట్టారు కేజ్రీవాల్. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆప్ అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేశారు.
We are proud to announce our First List of candidates for Gujarat Assembly Elections 2022 🥳
— AAP (@AamAadmiParty) August 2, 2022
We firmly believe that Gujarat is ready for CHANGE, and now is the time! 🔥
All the best to all the candidates ✌️🏻 pic.twitter.com/g5jTxoOoLa
10 మందితో
ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly) ఎన్నికల్లో పోటీచేసే 10 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది ఆమ్‌ఆద్మీ. భీమాభాయ్ చౌదరి, జగ్మల్ వాలా, అర్జున రథ్వా, సాగర్ రబరి, వశ్రామ్, రామ్ ధనుక్, శివపాల్ బరసియా, సునీల్ వాఘాని, రాజేంద్ర సోలంకి, ఓంప్రకాష్ తివారీలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇందులో ఎక్కువ మంది పాటిదార్ వర్గానికి చెందిన వారు కావడం విశేషం. గుజరాత్‌లో 111 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
హామీలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని కేజ్రీవాల్ అన్నారు. పలు హామీలు ప్రకటించారు.
- 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
- రాబోయే ఐదేళ్లలో ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం కల్పిస్తాం
- అందరికీ ఉద్యోగాలు కల్పించేంత వరకూ నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి
- 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కల్పిస్తాం.
- ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ప్రశ్నాపత్నం లీక్ కాకుండా చూడటంతో పాటు ఇందుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక చట్టం తీసుకువస్తాం.
Also Read: TMC MP Mahua Moitra Bag Price: ఆ బ్యాగ్‌ను MP ఎందుకు దాచేశారు? దాని ధర తెలిస్తే అవాక్కవుతారు!
Also Read: Kerala MP Ramya Haridas: ఓ మంచి అబ్బాయిని చూడండి- పెళ్లి చేసుకుంటా: పాటలు పాడుతూ MP రిక్వెస్ట్