By: Ram Manohar | Updated at : 28 Apr 2023 11:48 AM (IST)
గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులు కొట్టుకున్నారు. (Image Credits: ANI)
Greater Noida Private University:
నోయిడాలోని యూనివర్సిటీలో
సోషల్ మీడియాలో స్టూడెంట్స్ కొట్లాడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఇది జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు గొడవ పడ్డారు. అయితే...ఇందుకు కారణమేంటన్నది మాత్రం ప్రస్తుతానికి ఇంకా తేలలేదు. దంకౌర్ పోలీస్ట్ స్టేషన్లో ఈ ఘర్షణపై యూనివర్సిటీ యాజమాన్యం కంప్లెయింట్ చేసింది. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. ఇది ఎప్పుడు జరిగిందన్నది తేలకపోయినా...ఇలాంటివి సహించేదే లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది.
#WATCH | A brawl broke out between first-year and second-year students of a private university in Greater Noida, UP. Dankaur PS and University administration are taking necessary action in the incident by taking cognizance of the viral video.
(Viral video, confirmed by Police) pic.twitter.com/5YeiJuNy7q— ANI (@ANI) April 28, 2023
చీర కోసం ఫైట్..
చీరలు, నగలు అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగలు, పబ్బాలతో సంబంధం లేకుండా కొందరు షాపింగ్ చేస్తూనే ఉంటారు. మరి కొందరు డబ్బులు దాచుకుని మరీ బంగారం కొంటారు. నచ్చిందంటే ఎంత కాస్ట్ అయినా సరే కొనేస్తారు. మామూలుగానే చీరలంటే తెగ ప్రేమించే మహిళలు...వాటిని ఫ్రీగా ఇస్తానంటే ఊరుకుంటారా..? ఎంత దూరమైనా సరే అడ్రెస్ కనుక్కొని మరీ వెళ్తారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఇలాంటి ఆఫరే పెట్టారు. ఏ చీర అయినా సరే ఫ్రీగా పట్టుకెళ్లండి అంటూ ప్రకటించింది మైసూర్ సిల్క్స్ (Mysore Silks). ఆ యాడ్ చూసిన వెంటనే పెద్ద ఎత్తున వచ్చేశారు మహిళలు. ఎవరికి నచ్చినవి వాళ్లు తీసుకున్నారు. కానీ ఆ తరవాతే ఉన్నట్టుండి అక్కడ అలజడి రేగింది. ఓ చీర కోసం ఇద్దరి మహిళలు గొడవ పడ్డారు. నాదంటే నాదంటూ కొట్టుకున్నారు. ఈ ఫైట్ ఎక్కడి వరకూ వెళ్లిందంటే...ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని మరీ లాక్కున్నారు. చుట్టూ ఉన్న వాళ్లంతా ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించినా అస్సలు పట్టించుకోలేదు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తుకొచ్చింది. ఇద్దరినీ వెనక్కి లాగే ప్రయత్నం చేసింది. అయినా ఊరుకోలేదు. ఒకరినొకరు చెంప దెబ్బలు కొట్టుకుంటూ మరింత రెచ్చిపోయారు.
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023
మహిళలతో కిటకిటలాడుతున్న ఆ షాపింగ్ మాల్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అయినా పక్కనున్న వాళ్లు మాత్రం ఏమీ పట్టించుకోకుండా తమకు నచ్చిన చీరల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓ వ్యక్తి ఈ తతంగాన్నంతా వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయింది. అప్పుడే లక్ష మంది ఈ వీడియోని చూశారు. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "పక్కన అంత గొడవ జరుగుతున్నా..ఏమీ పట్టనట్టు షాపింగ్ చేస్తున్నారు" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో యూజర్ అయితే "శారీ అంటే జస్ట్ ఓ క్లాత్ కాదు. అదో ఎమోషన్" అంటూ సినిమా లెవెల్లో డైలాగ్ పోస్ట్ చేశాడు.
Also Read: Manipur Violence: సీఎం సభనే టార్గెట్ చేసిన ఆందోళనకారులు, మణిపూర్‌లో హై అలెర్ట్ - ఇంటర్నెట్ బంద్
TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ భారీ బోనస్ ప్రకటన - ఈసారి ఏకంగా రూ.700 కోట్లు
ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్
Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి