By: ABP Desam | Updated at : 23 Jul 2022 05:27 PM (IST)
గూగుల్ వాలెట్ వచ్చేసింది- ఇక "జీపే" ఉండదా ?
Gpay Now Google Wallet : గూగుల్ పే .. జీ పే గురించి తెలియని వారు ఉండరు. మొదట్లో క్యాష్ బ్యాక్‌లు ఇచ్చి అందర్నీ ఖాతాదారులుగా మార్చేసుకున్న జీపే.. నమ్మకమైన సర్వీస్ అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ జీపే యాప్‌లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు పేరే మార్చేసింది. జీ పే ను గూగుల్ వాలెట్‌గా మార్చేసింది. కీలకమైన మార్పులు కూడా తెచ్చింది. భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే అందరికీ కాదు. ఆండ్రాయిడ్ 5.2 ఆపైన ఉన్న వారు ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
యాపిల్ ఎయిర్ పోడ్స్‌కు సరైన పోటీ - పిక్సెల్ బడ్స్ లాంచ్ చేసిన గూగుల్!
డిజిటల్ చెల్లింపులు చేసే వారికోసం గూగుల్ మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న గూగుల్ పే యాప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త పేమెంట్ యాప్‌ను తీసుకొచ్చింది. గూగుల్ వాలెట్ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌ను ముందుగా భారత్‌తో సహా 39 దేశాల్లో ఆండ్రాయిడ్, వేర్ ఓఎస్‌తో పనిచేస్తున్న డివైజ్‌లలో పరిచయం చేయనుంది. ఈ యాప్‌లో కొత్తగా మరికొన్ని ఫీచర్లను తీసుకురానుంది.
ప్యూర్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడాలనుకుంటున్నారా? అయితే ఇదే బెస్ట్ ఆప్షన్!
గూగుల్ సంస్థ వాలెట్ యాప్‌కు పేస్ రికగ్నిషన్, పాస్‌వర్డ్ లాకింగ్ ఫీచర్‌తో భద్రత కల్పిస్తోంది. మరీ ముఖ్యంగా డేటా భద్రత కోసం ఎన్‌క్రిప్షన్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. టికెట్ రిజర్వేషన్, టికెట్ బుకింగ్, ట్రాన్సిట్ కార్డ్ కోసం ఇతర యాప్‌లను ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా వాలెట్ యాప్ నుంచే యాక్సెస్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ కల్పిస్తోంది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్ అనగానే కేవలం నగదు చెల్లింపులకు మాత్రమే కాదు, ఇతరత్రా ఫీచర్లను కూడా అందిస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల వివరాలతోపాటు లాయల్టీ కార్డులు, బోర్డింగ్ పాస్‌లు, ట్రాన్సిట్ కార్డులు, హోటల్ కీ వంటి వాటిని కూడా వీటిలో స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంత సమాచారం ఒకే యాప్‌లో ఉంటే దాని భద్రత కూడా పటిష్ఠంగా ఉండాలేందుకు గూగుల్ ఈ మార్పులు చేసింది.
వందలాది మందిని ఒకేసారి తొలగించిన సంస్థ, కారణమేంటో తెలుసా?
గూగుల్ వాలెట్ అనే పేరు ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్తేమీకాదు. యాపిల్ పే తరహాలో తొలుత ఆండ్రాయిడ్ ఓఎస్‌లో గూగుల్ వాలెట్‌ను పరిచయం చేశారు. 2015లో దాని పేరును ఆండ్రాయిడ్ పేగా మార్చారు. 2018లో మరోసారి గూగుల్ పే అని రీబ్రాండ్ చేశారు. ప్రస్తుతం ఇదే పేరుతో యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగిస్తున్నారు. భారత్‌లో కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది.
SSC CPO Notification 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!
Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ
Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం
What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!