Google Idli Doodle: డూడూల్‌తో ఇడ్లీని సెలబ్రేట్ చేసిన గూగుల్ - ప్రత్యేకత ఏంటో తెలుసా?
Idli doodle: గూగుల్ హోమ్‌పేజీలో ఇడ్లీకి ప్రత్యేక డూడుల్‌ను అందించింది దక్షిణ భారతదేశంలోని ఈ ప్రసిద్ధ వంటకాల వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది.

Google celebrates Idli with a doodle: గూగుల్ శనివారం హోమ్‌పేజీలో ఇడ్లీకి ప్రత్యేక డూడుల్‌ను అందించింది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రసిద్ధ వంటకానికి సంబంధించిన ఈ డూడుల్, దాని సాంస్కృతిక , వంటకాల వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది. గూగుల్ లోగోను ఇడ్లీలు, బ్యాటర్ పాత్రలు, చట్నీలు, సాంబార్‌తో , ట్రెడిషనల్ గా చూపించింది. ఈ డూడుల్‌లో ఇడ్లీ తయారీ ప్రక్రియను – బియ్యం, మినపప్పు నుంచి ఫెర్మెంటేషన్, స్టీమింగ్ వరకు – రంగురంగుల ఆర్ట్‌వర్క్‌లో చూపించారు. ఇది ఏదైనా ప్రత్యేక రోజు జరుపుకోవడం కాకుండా ఇడ్లీ సూపర్‌ఫుడ్ స్థితిని గుర్తుచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే వంటకంగా గూగుల్ గుర్తించింది.
గూగుల్ డూడుల్స్ పోర్టల్‌లో ప్రచురించిన ఈ డూడుల్, "టుడే'స్ డూడుల్ సెలబ్రేట్స్ ఇడ్లీ, ఎ సేవరీ, స్టీమ్డ్ సౌత్ ఇండియన్ కేక్ మేడ్ ఫ్రామ్ ఎ ఫెర్మెంటెడ్ బ్యాటర్ ఆఫ్ రైస్ అండ్ ఉరద్ డాల్" అని వివరించింది. ఇడ్లీ తయారీలోని ప్రతి దశను – అనిమేటెడ్ ఫార్మాట్‌లో చూపించారు. ఇది ఇడ్లీ సరళత్వం, ఆరోగ్య ప్రయోజనాలు, కుటుంబాల్లో పంచుకునే సంస్కృతిని హైలైట్ చేస్తుంది. గూగుల్ ఈ డూడుల్‌ను అక్టోబర్ 11, 2025న లాంచ్ చేసింది, ఇది వరల్డ్ ఇడ్లీ డే మార్చి 30 కు సంబంధం లేకుండా, భారతీయ వంటకాల వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక స్వతంత్ర ట్రిబ్యూట్‌గా రూపొందించారు.
Disclaimer: This video might make you very hungry 😋 Check out today's #GoogleDoodle celebrating idli, and tell us which one is your fave 👀 pic.twitter.com/PZB70Zi2TN
— Google India (@GoogleIndia) October 11, 2025
ఇడ్లీ తయారీ ప్రక్రియ సులభంగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగాఉంటాయి. ఈ డూడుల్ ద్వారా గూగుల్, ఇడ్లీ యొక్క గ్లోబల్ పాపులారిటీని – చెన్నై నుంచి చికాగో వరకు – గుర్తుచేస్తోంది.ఇడ్లీ దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రసిద్ధి చెందిన వంటకం, శ్రీలంకలో కూడా పాపులర్. దీని మూలాలు 6వ శతాబ్దానికి చెందినవి. ఒక ఇడ్లీలో 58 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. రాగి ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, క్వినోవా ఇడ్లీ, పొడి మిక్స్‌తో ఫ్రైడ్ ఇడ్లీలు కూడా ఇటీవలి కాలంలో తయారు చేస్తున్నారు.
Fluffy, warm and full of comfort, idli feels right at any time of day ☀️🍛
— Google India (@GoogleIndia) October 11, 2025
Celebrating a dish that makes every meal feel like home with today’s #GoogleDoodle 💚 pic.twitter.com/AudYfAFUaP
ఈ డూడుల్ భారతీయ వంటకాలను గ్లోబల్ స్టేజ్‌పై తీసుకువెళ్తోంది. గూగుల్ డూడుల్స్ సాధారణంగా సాంస్కృతిక, కళాత్మక థీమ్‌లను హైలైట్ చేస్తాయి, ఇది ఇడ్లీ గ్లోబల్ అప్పీల్‌ను చూపిస్తోంది. నిపుణులు "ఇది భారతీయ ఫుడ్ హెరిటేజ్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తూ, టూరిజం, ఎక్స్‌పోర్ట్‌లకు దోహదపడుతుంది" అని అంచనా వేస్తున్నారు.





















