Special Trains: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ఇవే..!
Summer Special Trains : దక్షిణ మధ్య రైల్వే. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ పలు ప్రాంతాల మధ్య నడపాలని నిర్ణయించింది. 14 సర్వీసులను నడపనుంది.
Summer Special Trains : వేసవి సెలవులు వస్తే చాలు.. వివిధ ప్రాంతాల్లో టూర్లు వేయాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా అనేక ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తుంటారు. అటువంటి ప్రయాణీకులకు శుభవార్త చెప్పింద దక్షిణ మధ్య రైల్వే. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ పలు ప్రాంతాల మధ్య నడపాలని నిర్ణయించింది. దీని వల్ల వందల మంది రైల్వే ప్రయాణీకులకు మేలు చేకూరనుంది.
నాలుగు ప్రత్యేక రైళ్లను వేసిన దక్షిణ మధ్య రైల్వే.. పలు రోజుల్లో 14 సర్వీసులను నడపనుంది. 07440 నెంబరు గల రైలు మే ఐదు, 12 తేదీల్లో తిరుపతి - శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రయాణించనుంది. రెండు సర్వీసులు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
06441 నెంబరుగల రైలు.. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతి మధ్య మే ఆరు, 13 తేదీల మధ్య నిర్వహించనుంది. ఇది కూడా రెండు సర్వీసులు. 06217 నెంబరు గల యశ్వంత్‌పూర్ - గయ ఈ నెల 27, ఏప్రిల్ 25 మధ్య నిర్వహించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇది మొత్తంగా ఆరు సర్వీసులు ఉంటాయని పేర్కొంది. 06218 నెంబరు గల రైలు గయ - యశ్వంత్‌పూర్ మధ్య ఈ నెల 29, మే 27న ఐదు సర్వీసులు నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఈ సేవలను వినియోగించుకోవాల్సిందిగా రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు.
ప్రయాణీకులకు ఎంతో మేలు
అదనపు రైళ్ల ఏర్పాటుతో రైల్వే ప్రయాణీకులకు ఎంతో మేలు కలుగనుంది. వేసవి సెలవులు నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. టూర్లు వేస్తుంటారు. భారీ సంఖ్యలో ప్రయాణాలు సాగించడం వల్ల రైళ్లకు తాకిడి పెరుగుతుంది. ఇది ప్రయాణీకులకు ఇబ్బందిగా మారుతుంది. ఇటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల వందలాది మంది రైల్వే ప్రయాణీకులు సాఫీగా తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు అవకాశం ఉంది. ఈ సేవలను వినియోగించుకోవడం ద్వారా సుఖ ప్రయాణాన్ని పొందవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.