(Source: ECI/ABP News/ABP Majha)
రిమోట్ వర్క్ ఇండెక్స్‌లో దారుణంగా పడిపోయిన భారత్ ర్యాంక్, కారణాలివే
Global Remote Work Index: గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ దారుణంగా పడిపోయింది.
Global Remote Work Index:
గ్లోబల్ రిమోట్ వర్క్..
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ రిమోట్ వర్క్‌పై (Remote Work) దృష్టి పెడుతున్నాయి. చాలా వరకూ కంపెనీలు ఉద్యోగులకు రిమోట్ వర్క్ ఆప్షన్ ఇస్తున్నాయి. అయితే...ఈ విషయంలో భారత్ చాలా వెనకబడి ఉందని Global Remote Work Index 2023 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో సర్వే చేపట్టగా...ఈ ఇండెక్స్‌లో భారత్‌కి 64వ ర్యాంక్ వచ్చింది. గతేడాది కన్నా దాదాపు 15 ర్యాంక్‌లకు పడిపోయింది. NordLayer అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ Global Remote Work Index (GRWI)ని ఏటా పబ్లిష్ చేస్తూ ఉంటుంది. మొత్తం నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయిస్తుంది. మొదటిది సైబర్ సేఫ్‌టీ, ఇక రెండోది ఎకనామిక్ సేఫ్‌టీ, ఆ తరవాత డిజిటల్, ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోషల్ సేఫ్‌టీ. ఈ క్రైటేరియా ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ విషయంలో భారత్ కాస్త వెనకబడి ఉందని ఈ ఇండెక్స్ వెల్లడించింది. NordLayer సంస్థ మేనేజర్ డొనటస్ టమెలిస్ (Donatas Tamelis) మాటల్లో చెప్పాలంటే...కొన్ని బడా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని కట్ చేసి ఆఫీస్‌కి రమ్మని ఆదేశిస్తున్నాయి. కానీ...రిమోట్ వర్క్ పరంగా చూస్తే మాత్రం ఇండియాలోని కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగానే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవడం లేదు. దీన్ని కేవలం ట్రెండ్‌గానే భావించకుండా వర్క్ కల్చర్‌లో జరుగుతున్న మార్పుగా గుర్తించాలని సూచిస్తున్నారు డొనటస్.
వెనకబడిన భారత్..
ఈ సంస్థ పరిగణనలోకి తీసుకునే నాలుగు అంశాల్లోనూ భారత్ పర్‌ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేదన్నది ఆయన చెబుతున్న మాట. డిజిటల్ అండ్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారత్‌కి 77 వ ర్యాంక్, సోషల్ సేఫ్‌టీలో 74 వ ర్యాంక్‌లు వచ్చాయి. ఇక e-infrastructure విషయంలో ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ బాగా వెనకబడి ఉందని చెప్పింది ఈ ఇండెక్స్. ఈ కేటగిరీలో 95 వ ర్యాంక్ సాధించింది భారత్. ఇంటర్నెట్ క్వాలిటీ విషయంలో 70వ ర్యాంక్ సాధించింది. సోషల్ సేఫ్‌టీ విషయానికి వస్తే...వ్యక్తిగత హక్కుల ఇండెక్స్‌లో 88వ ర్యాంక్ వచ్చింది. సైబర్, ఎకనామిక్ సేఫ్‌టీలో భారత్ పని తీరు యావరేజ్‌గా ఉందని వెల్లడించింది. కాస్ట్ ఆఫ్ లివింగ్‌లోనూ వెనకబడి ఉంది. హెల్త్‌కేర్ సిస్టమ్‌లో 93వ ర్యాంక్ సాధించింది. ఇక గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్‌లో డెన్మార్క్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. తరవాత నెదర్లాండ్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడెన్, పోర్చుగల్, ఎస్తోనియా, లిథుయానియా, ఐర్లాండ్, స్లోవాకియా ఉన్నాయి