Viral Video: బైక్‌పై స్టంట్‌లు చేసిన అమ్మాయిలు, ఆ పై హగ్గులు ముద్దులు - వైరల్ వీడియో
Viral Video: ఇద్దరు అమ్మాయిలు బైక్ స్టంట్‌లు చేస్తూ ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
ముద్దులు పెట్టుకున్న అమ్మాయిలు..
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి నానా వెర్రి పనులు చేస్తున్నారు కొందరు. ఎగరడాలు, దూకడాలు..ఇలా ఏది పడితే అది చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు బైక్‌పై స్టంట్‌లు చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బైక్‌పైనే ముద్దులు పెట్టుకుంటూ చక్కర్లు కొట్టిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి వీడియోనే వైరల్ అవుతోంది. కాకపోతే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అలా బైక్‌పై స్టంట్‌లు చేస్తూ ముద్దులు పెట్టుకున్న ఇద్దరూ అమ్మాయిలే. అవును. ఓ అమ్మాయి మరో అమ్మాయిని ముద్దు పెట్టుకుంది. దీన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయిపోయింది. రొమాంటింగ్‌కా ఒకరిని ఒకరు హత్తుకుని ఆ తరవాత కిస్ చేసుకున్నారు. అది స్కూటీ కూడా కాదు. బైక్. ఓ అమ్మాయి నడుపుతుండగా...మరో అమ్మాయి పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని ఉంది. ముందు ఇద్దరూ స్టంట్‌లు చేశారు. ఆడుకున్నారు. ఆ తరవాత ముద్దు పెట్టుకున్నారు. నడి రోడ్డుపై ఈ సాహసం చేశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే...అంత జరిగినా బైక్ బ్యాలెన్స్ తప్పలేదు. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్‌లు పెడుతున్నారు. ఇన్‌స్టాలోనే కాదు. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతోందీ వీడియో. కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుండగా..మరి కొందరు ఇదేం పిచ్చి పని అని తిడుతున్నారు. మరి కొందరైతే పోలీసులను ట్యాగ్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. అందుకే బాయ్స్ సింగిల్‌గా మిగిలోపోతున్నారంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram
మరో స్టంట్ వీడియో వైరల్..
బైక్‌పై వెళ్తూ ప్రమాదకర స్థితిలో బస్సు వెనక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో ఘటనపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెర్రి వేయి విధానాలు అంటే ఇదే అంటూ తన పర్సనల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండని వీడియో ట్యాగ్ చేసి మరీ చెప్పారు. అలాగే ప్రమాదాల బారిన పడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకండని చెప్పుకొచ్చారు. టీఎస్ఆర్టీసీ ఎండీ అనే అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మిధానీ డిపోనకు చెందిన బస్సు 104-ఎ రూట్లో ఆర్టీసీ బస్సు వెళ్తుండగా.. ఓ యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతూ ఓ కాలుతో బస్సు వెనక భాగాన్ని నెడుతున్నట్లు ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇలాంటి ఘటనలను #TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. @TSRTCHQ https://t.co/AHSQQ7xbO9
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 2, 2023
Also Read: Bajrang Dal Ban: భజ్రంగ్ దళ్‌ని బ్యాన్ చేసే ఆలోచనే లేదు, ఆ అధికారం ప్రభుత్వానికి ఉండదు - కాంగ్రెస్ సీనియర్ నేత