German Election Results: 16 ఏళ్ల తర్వాత జర్మనీలో ఏంజెలా మెర్కెల్ పార్టీ ఓటమి!
జర్మనీలో జరిగిన ఎన్నికల్లో ఏంజెలా మెర్కెల్ ఓటమి పాలయ్యారు. మెర్కెల్ 16 ఏళ్లుగా జర్మనీ ఛాన్సలర్‌గా ఉన్నారు.
దాదాపు 16 ఏళ్ల తర్వాత జర్మనీలో కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది. శక్తిమంతమైన నేతగా పేరొందిన ఏంజెలా మెర్కెల్ పార్టీ స్వల్ప తేడాతో ఎన్నికల్లో పరాజయం పొందింది. మెర్కెల్ 16 ఏళ్లుగా జర్మనీకి ఛాన్స్‌లర్‌గా ఉన్నారు.
సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమోక్రాట్స్ (ఎస్‌పీడీ) పార్టీ ఎన్నికల్లో 25.7% ఓట్లను సాధించింది. ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని సీడీయూ/సీఎస్‌యూ నేతృత్వంలోని కన్జర్వేటివ్ బ్లాక్ పార్టీ 24.1% ఓట్లతో వెనుకబడింది. ప్రభుత్వ ఏర్పాటు అవసరమైన 31 శాతం ఓట్లను ఏ పార్టీ సొంతం చేసుకోకపోవటం వల్ల కూటమితోనే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పర్యావరణవేత్త గ్రీన్స్ పార్టీ 14.8 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది.
Germany‘s Federal election commission has just published the “preliminary” final results of Sunday’s #btw21 election (results will be made final and official on Oct 15 in Parliament)
— Thomas Sparrow (@Thomas_Sparrow) September 27, 2021
Turnout: 76.6 per cent (2017: 76.2 Prozent) https://t.co/zQ0NxOgM2a
ఓడిపోయినట్లేనా..?
ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ కంటే సోషల్ డెమొక్రటిక్ పార్టీకి పోల్ అయిన ఓట్ల శాతం నామమాత్రంగా ఉంది. దీన్ని భర్తీ చేసుకోవడానికి ఏంజెలా మెర్కెల్.. ఇతర పార్టీలను కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి.
తుది విడత ఫలితాలు వెలువడే సమయానికి తాము ఆధిక్యంలో నిలుస్తామని కన్జర్వేటివ్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలను కూడా కలుపుకొని ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.
Final details about #btw21 election:
— Thomas Sparrow (@Thomas_Sparrow) September 27, 2021
🔹 SPD won 53 new seats, CDU lost 49
🔹Greens won 51 new seats
🔹Turnout: 76.6% (2017: 76.2)
🔹 New Bundestag will consist of 735 members (2017: 709)
🔹8 parties will be represented, including regional minority party from the north https://t.co/rGaBG8m0KU
మద్దతు ఇస్తారా?
14.5 శాతం మేర ఓట్లు సాధించిన గ్రీన్స్ పార్టీ, 11.5 శాతం ఓట్లు ఉన్న లిబరల్ ఫ్రీ డెమొక్రటిక్ పార్టీని కలుపుకొని కన్జర్వేటివ్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాలోచనలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలంటూ సోషల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడు ఒలాఫ్ ష్కోల్జ్ డిమాండ్ చేశారు.