Gautam Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ - మళ్లీ టాప్ ప్లేస్‌లోకి - ఇదిగో హురూన్ లిస్ట్
Richest Indian : రిచ్చెస్ట్ ఇండియన్ ఇప్పుడు ముకేష్ అంబానీ కాదు. గౌతమ్ అదానీ. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో ఈ మేరకు జాబితా ప్రకటించారు.
Gautam Adani replaces Mukesh Ambani as the richest Indian : గౌతమ్ అదానీ మరోసారి భారతీయుల్లో అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. హిండెన్ బర్గ్ బండలు వేయడంతో రెండు సార్లు కిందపడిపోయినా ఆయన మళ్లీ బలంగా లేచి నిలబడి.. అంబానీ కంటే ధనవంతడిగా మార్చారు. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ తాజాగా విడుదల అయింది. ఇందులో అదానీ గ్రూప్ ఓనర్ అయిన గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్ల సంపదతో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్నారు. భారత్‌లో ప్రతి ఐదు రోజులకు ఒక బిలియనీర్ ఆవిర్భవిస్తున్నారని నివేదిక వెల్లడించింది.
ఆసియాలో భారత్ బిలియనీర్ల దేశంగా ఆవిర్భవిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మారిన చైనాలో ఇరవై శాతం మేర బిలియనీర్ల వృద్ధి తగ్గుతోంది. అదే సమయంలో భారత్ లో ఇరవై తొమ్మిది శాతం బిలియనీర్ల వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తతానికి భారత్ లో 334 మంది బిలియనీర్లు ఉన్నారని హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ఫౌండర్ అండ్ రీసెర్చర్ అనాసర్ రహ్మన్ జూనాయిద్ ప్రకటించారు.
ప్రపంచంలోనే ధనిక గ్రామం, మైండ్ బ్లాంక్ అయ్యే విశేషాలు - మన దేశంలోనే ఉందా ఊరు
జెప్టో స్టార్టప్ ఫౌండర్ కైవల్య వోహ్ర అతి చిన్న వయసులోనే బిలియనీర్ గా అవతరించారు. 21 ఏళ్లకే ఆయన ఇండియా బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అదే సమయంలో జెప్టో కో ఫౌండర్ అదిల్ పాలిచా వయసు ఇరవై రెండేళ్లు. ఆయన కూడా అతి చిన్న వయసు బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొదటి సారి భారత సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన వ్యాపారలతో పాటు ఐపీఎల్ టీం కోల్ కతా నైట్ రైడర్స్ విలువ భారీగా పెరగడంతో షారుఖ్ ఖాన్ బిలియనీర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా ఫోర్భ్స్ కంపెనీ ఇలాంటి రిచ్ లిస్టులను ప్రకటిస్తూ ఉంటుంది. భారత్ కు చెందిన హురూన్ రీసెర్చ్ ఇటీవలి కాలంలో ఇలాంటి జాబితాలు ప్రకటిస్తుంది. ఈ జాబితా.. జూలై చివరి రోజు వరకు ఉన్న పరిస్థితి అని సంస్థ ప్రకటించింది. ముఖేష్ అంబానీ సంపద స్థిరంగా పెరుగుతూ వస్తోంది. అయితే అదానీ మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయన కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లడంతో ఓ దశలో ప్రపంచం కుబేరుల్లో టాప్ టెన్ కు చేరుకున్నారు.
ఆ సమయంలో హిండెన్ బెర్గ్ రిపోర్ట్.. అదానీ కంపెనీల షేర్లలో అక్రమాలు బయట పడ్డాయని చెప్పి నివేదిక వెల్లడించడంతో షేర్ వాల్యూ భారీగా పడిపోయాయి. దాంతో ఆయన తీవ్రంగా నష్టపోయారు. తర్వాత సెబీ విచారణ జరిపి ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని నివేదిక ఇవ్వడంతో షేర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇటీవల సెబీ చైర్ పర్సన్ పై కూడా అదానీ విషయంలో హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసింది. అప్పుడు కూడా షేర్ ధరలు తగ్గాయి. అయినా అదానీ.. మరోసారి దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు.