(Source: ECI/ABP News/ABP Majha)
Gambia Child Deaths: ఆ కాఫ్ సిరప్ ప్లాంట్‌ను మూసేసిన ప్రభుత్వం, కఠిన చర్యలకు ఆదేశం
Gambia Child Deaths: హరియాణాలోని మైడెన్ ఫార్మా కంపెనీ ప్లాంట్‌ను ప్రభుత్వం మూసేసింది.
Haryana Stops Drug Production:
హరియాణాలో ప్లాంట్..
కొన్ని కాఫ్ సిరప్‌లు చిన్నారుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంచనల ప్రకటన చేసింది. అంతే కాదు. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ నుంచి తయారైన నాలుగు రకాల దగ్గు, జలుబు మందులు పిల్లల మరణాలకు కారణం. ఈ మైడెన్ ఫార్మా కంపెనీ మన దేశానికి చెందినదే. పిల్లల మరణానికి కారణమైన ఆ నాలుగు మందులు ఇక్కడ తయారైనవే. గాంబియాలో 66 మంది పిల్లల మరణంతో ఇండియాలో తయారైన ఆ నాలుగు మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ మందులు విషపూరితమని వ్యాఖ్యానించింది. ఆ నాలుగు మందులు పిల్లల దగ్గు, జలుబుకు వాడే సిరప్‌లు. ఇప్పటికే భారత్‌లో దీనిపై పెద్ద కలవరమే రేగింది. WHO ప్రకటించిన వారం రోజులకే...దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. హరియాణాలోని మైడెన్ ఫార్మా కంపెనీకి చెందిన ప్లాంట్‌ను మూసేసింది ప్రభుత్వం. అంతే కాదు. ఈ సిరప్ ఉత్పత్తిని ఇప్పటికిప్పుడు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. "WHO చెప్పిన సోనిపట్ ఫార్మా కంపెనీకి చెందిన మూడు సిరప్‌ల శాంపిల్స్‌ని కలకత్తాలోని డ్రగ్ ల్యాబ్‌కు
పంపాం. వీటి రిజల్ట్స్ ఇంకా రాలేదు. ఇవీ ప్రమాదకరమని తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం" అని హరియాణా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. అయితే..ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన సోదాల్లో ఆయా సిరప్‌ల ఉత్పత్తిలో అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తించారు.
షోకాజ్ నోటీసులు..
ఇప్పటికే ఈ సంస్థకు షోకాజ్ నోటీసులు అందించింది ప్రభుత్వం. రికార్డులు సరిగా నిర్వహించకపోవటం, ఏయే ప్రమాణాలు ఉపయోగించి సిరప్‌లు తయారు చేస్తున్నారో వివరాలు తెలియజేయకపోవటం లాంటి వాటిపై సీరియస్‌గా ఉంది హరియాణా ప్రభుత్వం. అసలు ఆ కాఫ్ సిరప్‌కు సంబంధించిన బ్యాచ్ నంబర్స్‌ని కూడా ఎక్కడా మెన్షన్ చేయకపోవడమూ అనుమానాలకు తావిస్తోంది. ప్రోపిలీన్ గ్లైకాల్, సోర్బిటాల్ సొల్యూషన్, సోడియం మిథైల్ పారాబెన్ లాంటి రసాయనాలు ఇందులో ఉన్నట్టు గుర్తించారు. ఇక సిరప్ ప్రొడక్షన్‌కు సంబంధించిన వాలిడేషన్ ప్రాసెస్‌నూ స్పష్టంగా చెప్పకపోవటం మరో సమస్య. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో తయారైన ఈ ఉత్పత్తుల్లో డైఇథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్టుగా పరీక్షల్లో తేలిందని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపుగా 23 నమూనాలలో ఈ నాలుగు డైఇథలిన్ గ్లైకాల్ లేదా ఇథలిన్ గ్లైకాల్ ఉన్నట్టుగా తేలింది. డై ఇథలిన్ గ్లైకాల్ విషపూరితమైంది. దీన్నీ వాడినపుడు కిడ్నీ, నాడీ మండలం మీద దీని ప్రభావం ఉంటుంది. ఈ రసాయనాన్ని మందులలో ఉపయోగించి నపుడు మాస్ పాయిజనింగ్ జరిగినట్టు ఇది వరకు కూడా రుజువులు ఉన్నాయి.
Also Read: Nara Lokehs Tweet : దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే - జగన్‌కు లోకేష్ ట్వీట్ కౌంటర్ !
Also Read: Bharat Jodo Yatra: రోడ్డుపై రాహుల్ గాంధీ పుష్ అప్ ఛాలెంజ్- ఉత్సాహంగా జోడో యాత్ర!