Bharat Jodo Yatra: రోడ్డుపై రాహుల్ గాంధీ పుష్ అప్ ఛాలెంజ్- ఉత్సాహంగా జోడో యాత్ర!
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తాజాగా రాహుల్ గాంధీ రోడ్డుపై పుష్ అప్‌లు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. ఇప్పటికే కేరళ, తమిళనాడులో ఈ యాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కూడా యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. కార్యకర్తలు, అభిమానులకు ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ.. కర్ణాటకలో రోడ్డుపై పుష్ అప్‌లు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#BharatJodoYatra Push-Up Challenge! 💪🔥 pic.twitter.com/mPEOHWhc0a
— Nitin Agarwal (@nitinagarwalINC) October 11, 2022
ఛాలెంజ్
52 ఏళ్ల రాహుల్ గాంధీ ఓ బాలుడితో కలిసి కర్ణాటకలో రోడ్డుపై పుష్ అప్‌లు చేశారు. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పుష్ అప్‌లు తీశారు. ఈ వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్‌లో షేర్ చేసి 'రాహుల్ పుష్ అప్ ఛాలెంజ్' అని పేర్కొన్నారు.
గతంలో రాహుల్ గాంధీ.. తమిళనాడులో ఓ కార్యక్రమంలో కూడా పుష్ అప్స్ తీశారు. అప్పుడు రాహుల్ సింగిల్ హ్యాండ్‌తో తీసిన పుష్ అప్ వీడియో విపరీతంగా వైరల్ అయింది.
షూ లేస్
రాహుల్‌తో కలిసి సోనియా గాంధీ కూడా ఇటీవల జోడో యాత్రలో పాలు పంచుకున్నారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న షూ లేస్ ఊడిపోయింది. దీంతో పక్కనే ఉన్న రాహుల్.. అమ్మ సోనియా గాంధీ షూ లేస్ కట్టారు. సోనియా నవ్వులు చిందిస్తూ తన కుమారుడిని చూశారు. తల్లీ కొడుకుల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "కాంగ్రెస్ పార్టీకి యువరాజైనా.. సోనియాకు మాత్రం రాహుల్ కొడుకే" అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
#Watch | As Sonia Gandhi joins the #BharatJodoYatra, video of Rahul Gandhi tying her shoe laces goes viral on social media. pic.twitter.com/hRKM4Zg2uK
— ABP LIVE (@abplive) October 6, 2022
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ.. పలువురు కార్యకర్తలు, ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
" సత్యం, అహింస మార్గంలో నడవడాన్ని మనకు బాపూజీ నేర్పించారు. ప్రేమ, కరుణ, సద్భావం, మానవత్వం అర్థాలను వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాం. బాపూజీ ఏ విధంగా అయితే అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారో, అదే విధంగా ఇప్పుడు మేం భారత దేశాన్ని ఏకం చేస్తాం. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Also Read: Bihar Accident: పోలీసు బస్సు కింద ఇరుక్కున్న బైక్- ముగ్గురు సజీవదహనం!
Also Read: Trains Cancelled Today: నేడు ఏకంగా 168 రైళ్లు రద్దు, రీషెడ్యూల్ - మీ ట్రైన్‌ను ఇక్కడ చెక్ చేస్కోండి