Trains Cancelled Today: నేడు ఏకంగా 168 రైళ్లు రద్దు, రీషెడ్యూల్ - మీ ట్రైన్‌ను ఇక్కడ చెక్ చేస్కోండి
నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ వెబ్‌సైట్‌లో 12 అక్టోబర్ 2022న రద్దు చేయబడిన రైళ్ల జాబితాను భారతీయ రైల్వే విడుదల చేసింది.
రైళ్లలో ప్రయాణించే వారికి అలర్ట్! మీరు ఈ రోజు రైలులో ప్రయాణించబోతున్నట్లయితే, మీ రైలు సర్వీసు నేడు నడుస్తుందో రద్దయిందో తెలుసుకోండి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు కారణాల వల్ల ఈ మధ్య రోజూ పదుల సంఖ్యలో రైలు సర్వీసులు రద్దు అవుతూ ఉన్నాయి. ఇవాళ (అక్టోబరు 12) కూడా 168 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. సోమవారం (అక్టోబరు 10) రోజు కూడా 140కి పైగా రైళ్లను రద్దు చేసింది. నేడు రద్దు చేసిన రైళ్లలో పెద్ద సంఖ్యలో ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. మీరు IRCTC సైట్ లేదా రైల్వే కౌంటర్ నుండి టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లయితే, భారతీయ రైల్వే మీకు ఛార్జీని రీఫండ్ చేస్తుంది.
నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ వెబ్‌సైట్‌లో 12 అక్టోబర్ 2022న రద్దు చేయబడిన రైళ్ల జాబితాను భారతీయ రైల్వే విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం, దేశవ్యాప్తంగా రైల్వేలోని వివిధ జోన్లలో కొనసాగుతున్న మరమ్మతులు, ఇతర కారణాల వల్ల ఈ రైళ్లను నడపకూడదని భారతీయ రైల్వే నిర్ణయించింది. అనేక రైళ్లను రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
రైళ్లను ఎందుకు రద్దు చేశారు?
దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో కొనసాగుతున్న ట్రాక్ మరమ్మతులు, నిర్మాణ పనులు, ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల దృష్ట్యా చాలా రైళ్లు రద్దు అవుతూ ఉన్నాయి.
రద్దయిన రైళ్ల వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
రద్దు అయిన రైళ్ల జాబితాను చెక్ చేస్కోండి
ముందుగా enquiry.indianrail.gov.in/mntes/ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇక్కడ మీరు కుడి వైపున చాలా రైళ్ల జాబితాను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రైళ్ల రద్దు, రీషెడ్యూల్, రైళ్లను దారి మళ్లించిన జాబితాను చూడవచ్చు. అక్టోబర్ 13న కూడా భారీ సంఖ్యలో రైళ్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.
రద్దయిన రైళ్లలో ఎక్కువగా పుణె, సతారా, బటిండా, ఫఠాన్‌కోట్, లక్నో, గోండా, ఆనంద్ విహార్ జంక్షన్, అమృత్‌సర్ జంక్షన్, గోరఖ్‌పూర్, న్యూఢిల్లీ, వడోదరా, రత్నగిరి, వారణాసి, ఘజియాబాద్, కాన్పూర్ సెంట్రల్, సీతాపూర్, వంటి నగరాలకు వెళ్లాల్సినవే ఉన్నాయి. అందువల్ల ప్రయాణికులు రైళ్ల షెడ్యూల్స్‌ను చెక్ చేసుకుని ప్రయాణాలు ప్రారంభించాలని అధికారులు కోరారు. అయితే, రద్దయిన రైళ్లకు సంబంధించి ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు.