అన్వేషించండి

KTR: మంత్రి కేటీఆర్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వ ఆహ్వానం.. ఆంబిషన్ ఇండియా సదస్సులో ప్రసంగించాలని విజ్ఞప్తి

మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఈ నెల 29న తమ సెనేట్‌లో జరిగే ఆంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం కేటీఆర్‌ని కోరింది.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి.. తమ సెనేట్‌లో జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఫ్రెంచ్ ప్రభుత్వం కోరింది. అక్టోబర్ 29న తమ సెనేట్‌లో జరిగే ఆంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేటీఆర్‌కు ఆహ్వాన లేఖను పంపింది. ఫ్రెంచ్ ప్రధానమంత్రి ఇమాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో ఏర్పాటైన ఈ సదస్సు.. భారత్, ఫ్రెంచ్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని లేఖలో పేర్కొంది. ఆంబిషన్ ఇండియా 2021 సదస్సులో కీనోట్ స్పీకరుగా 'గ్రోత్ - డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా' అనే అంశంపై అభిప్రాయాలు పంచుకోవాలని కేటీఆర్‌ను కోరింది. 

Also Read: తెలంగాణ వర్సిటీలో ఔట్ సోర్సింగ్ నియామకాలపై రచ్చ.. అక్రమాలు జరిగాయంటున్న విద్యార్థి సంఘాలు.. 

వ్యాపార అవకాశాలకు ఛాన్స్.. 
గతంలో నిర్వహించిన ఆంబిషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు.. 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని లేఖలో పేర్కొంది. ఈసారి అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని చెప్పింది. ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఈ సదస్సులో హెల్త్ కేర్, వాతావరణ మార్పులు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి అంశాలపైన ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశామని పేర్కొంది. దీంతో పాటు ఫ్రెంచ్, భారత్ కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని మంత్రికి పంపిన ఆహ్వాన లేఖలో ప్రస్తావించింది. 

Also Read: రంగంలోకి దిగితే బట్టలూడదీసి కొడతాం.. రేవంత్‌కు టీఆర్ఎస్ నేతల హెచ్చరిక !

మంత్రి కేటీఆర్ హర్షం.. 
ఫ్రెంచ్ దేశ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఫ్రెంచ్ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలను దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: పండక్కి ఊరెళ్తున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే.. పోలీసులు హెచ్చరిక 

Also Read: హుజురాబాద్‌లో 30, బద్వేలులో 15 మంది ! ఉపఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారు ! 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Breaking News: విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 
ABP Desam Top 10, 25 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 25 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
Embed widget