Kannababu Comments: చంద్రబాబుతో పొత్తు కోసం పవన్ హైడ్రామా, ఇద్దరిదీ అనైతిక రాజకీయం: ఎమ్మెల్యే కన్నబాబు
Kanna Babu Comments: బాబుతో పొత్తు కోసం పవన్ కల్యాణ్ హైడ్రామా చేస్తున్నారని ఎమ్మెల్యే కన్నబాబు విమర్శించారు. ఈరోజే వారిద్దరూ ముసుగు తొలగించారని ఆరోపించారు.
![Kannababu Comments: చంద్రబాబుతో పొత్తు కోసం పవన్ హైడ్రామా, ఇద్దరిదీ అనైతిక రాజకీయం: ఎమ్మెల్యే కన్నబాబు Former Minister And Mla Kurasala Kannababu Fires on Pawan Kalyan and Chandra Babu Kannababu Comments: చంద్రబాబుతో పొత్తు కోసం పవన్ హైడ్రామా, ఇద్దరిదీ అనైతిక రాజకీయం: ఎమ్మెల్యే కన్నబాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/c4afde6364656e6ced2557d815cc918e1666156154089233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kanna Babu Comments: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తు కోసం హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కూరసాల కన్నబాబు విమర్శించారు. ఇన్నాళ్లూ రహస్యంగా రాజకీయాలు సాగించిన వీరిద్దరూ.. ఈరోజు ముసుగు తొలగించారన్నారు. ఇద్దరిదీ అనైతిక రాజకీయం అంటూ ఫైర్ అయ్యారు.
పొలిటికల్ డ్రామా..
"చంద్రబాబుతో పొత్తు కోసమే పవన్‌కళ్యాణ్ హైడ్రామా. ఇన్నాళ్లూ ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. ఇవాళ బహిరంగంగా వ్యక్తం చేయడానికి బయటకు వచ్చారు. కలిసి కాపురం చేయబోతున్నామని అధికారంగా చెప్పడం కోసమే ఇవాళ ఈ హైడ్రమా. నిజానికి చంద్రబాబు, పవన్ కలిసే కాపురం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు."
మీరు హీరో కాదు.. జీరో..
ఎంతసేపూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపడమే పవన్ కల్యాణ్ పని అని కన్నబాబు ఆరోపించారు. తాను హీరోగా పోరాడుతున్నాను కాబట్టి గెలుస్తానని పవన్ అనుకుంటాడంటూ కామెంట్లు చేశారు. కానీ వాస్తవానికి ఆయన ప్రజల దృష్టిలో హీరో కాదు.. ఒక జీరో అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో, ఏపీ ప్రజల మనుసల్లో సీఎం జగన్ ఒక్కరే నిజమైన హీరో అని... ఇదే నిజం అని తెలిపారు. పవన్‌కు ఎక్కడా స్థిరత్వం లేదన్నారు. మాటలకు ఎక్కడా పొంతన ఉండదంటూ కామెంట్లు చేశారు. ఇదే విషయాన్ని ఇవాళ హైడ్రామాలో బాగా చూపించారన్నారు. చివరకు ఆయనకు సంస్కారం కూడా లేదని... కనీసం చదువు, సంధ్య, ఏ మాత్రం అవగాహన లేని వాళ్లు కూడా మాట్లాడని మాటలను పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని కన్నబాబు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్ తిడుతూనే బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు.
వారి గురించి మాట్లాడే అర్హత లేదు..
"కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా? ఆయన తన పక్కన కమ్మ సామాజికవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌ను కూర్చోబెట్టుకున్నాడు. ఆ పార్టీలో ఏ కాపు నాయకులకూ కనీసం కుర్చీ వేయలేదు. నీ పక్కన కూర్చోవడానికే కాపులకు అర్హత లేదు. అలాంటప్పుడు నీవు కాపులను ఎలా ఉద్దరిస్తావు నీ పార్టీకి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాత ఎవరెవరో అందరికి తెలుసు. రంగా హత్యకు బాధ్యడు ఎవరో తెలుసా..? ఆనాటి హోంమంత్రి హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో చంద్రబాబే రంగ హత్యకు బాధ్యులు అని రాశారు.. అదే చంద్రబాబు చంకలో కూర్చొని రంగా దారుణ హత్య గురించి కన్నీళ్లు కారుస్తావా?"
ఆనాడెందుకు మాట్లాడలేదు..?
ముద్రగడ పద్మనాభంను కాపులు ఒక ఐకానిక్ గా చూస్తారని.. అటువంటి ముద్రగడ కుటుంబంలోని మహిళలను దుర్మార్గంగా, తప్పుగా, వల్గర్ గా మాట్లాడి, హింసించి, చాలా భయంకరంగా ఆత్మక్షోభ చెందేలా చంద్రబాబు సర్కార్ ప్రవర్తించిందని కన్నబాబు గుర్తు చేశారు. ముద్రగడ పద్మనాభాన్ని నాలుగు గోడల మధ్య బంధించి హింసించినప్పుడు మీ రెస్పాన్స్ ఏదని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ముద్రగడను పలకరించడానికి వచ్చిన చిరంజీవిని చంద్రబాబు సర్కార్ రాజమండ్రి ఎయిర్ పోర్టులో నిర్బంధించి తిరిగి వెనక్కి పంపించినప్పుడు తమరు ఏం చేశారంటూ పవన్ పై ఫైర్ అయ్యారు.
అప్పుడూ ఇప్పుడూ ఒకరే మీ టార్గెట్...
సినిమాల్లో కుమ్మేస్తా, పీకేస్తా అన్న డైలాగులు బాగుంటాయి కానీ.. నిజ జీవితంలో, ముఖ్యంగా రాజకీయ జీవితంలో ఆ మాటలను ఎవరూ హర్షించరని హితవు పలికారు. రాజకీయ పార్టీ పెట్టి, బాధ్యత లేని రాజకీయం చేసే వరుసలో నెంబర్ వన్ స్థానంలో పవన్ కల్యాణ్ ఉంటారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ను తిడతారు.. అధికారంలో వచ్చాక జగన్ నే తిడతారంటూ కామెంట్లు చేశారు. అప్పుడు, ఇప్పుడు పవన్, చంద్రబాబుది ఫెవికాల్ బంధం అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి పవన్‌కు లేదని ప్రజలే అనుకుంటున్నారని చెప్పారు.
ఆరోజే ఎందుకు..?
పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు చెలికత్తె వేషం వేస్తున్నారని, విశాఖ గర్జన రోజే అక్కడకు రావాల్సిన అవసరం ఏంటిని ప్రశ్నించారు. వచ్చి ర్యాలీగా వెళ్లాల్సిన అవసరం ఏంటని, విజయవాడలో జనవాణికి వచ్చినప్పుడు ర్యాలీ ఎందుకు పెట్టలేదని అడిగారు. అది విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికే కదా అని కన్నబాబు అన్నారు. విశాఖలో అల్లరి చేసి, మహిళా మంత్రి మీద, బీసీ మంత్రి మీద దాడి చేశారన్నారు. కనీసం వారికి క్షమాపణ చెప్పాలన్న జ్ఞానం కూడా లేదని.. పైగా విజయవాడ వచ్చి వైయస్‌ఆర్ సీపీ నాయకుల్ని ఇష్టానుసారంగా తిట్టడం మీ సంస్కారానికి నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)