(Source: ECI/ABP News/ABP Majha)
Former Chinese leader Hu Jintao: చైనా మాజీ అధ్యక్షుడికి అవమానం, అందరూ చూస్తుండగానే గెంటేసిన సిబ్బంది
Former Chinese leader Hu Jintao: చైనా మాజీ అధ్యక్షుడిని ఉన్నట్టుండి సమావేశం నుంచి బయటకు పంపిన వీడియో వైరల్ అవుతోంది.
Former Chinese leader Hu Jintao:
రెండు నిముషాల పాటు గందరగోళం...
చైనాలో వారం రోజులుగా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ జరుగుతోంది. ఈ సమావేశం ముగింపు దశకు చేరుకుంది. చివరి రోజున కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేసింది సెంట్రల్ కమిటీ. అయితే...ఈ ముగింపు కార్యక్రమంలో అనూహ్య ఘటన జరిగింది. చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో ( Hu Jintao)ను ఉన్నట్టుండి హాల్‌లో నుంచి బయటకు పంపేశారు. గ్రేట్ హాల్‌లో ముందు వరసలో అధ్యక్షుడు జిన్‌పింగ్ కూర్చోగా..ఆయన పక్కనే మాజీ అధ్యక్షుడు హు జింటావో కూర్చున్నారు. స్టాఫ్ మెంబర్స్ అక్కడికి వచ్చి జింటావోతో ఏదో మాట్లాడారు. మొదటి ఓ వ్యక్తి వచ్చి ఆయనకు వివరించారు. అయితే...ఆయన అక్కడి నుంచి వెళ్లేందుకు అంగీకరించలేదు. ఆ తరవాత మరో ఇద్దరు సిబ్బంది వచ్చి మాట్లాడారు. ఓ వ్యక్తి జింటావోకు సపోర్ట్ ఇచ్చి కుర్చీలో నుంచి లేపారు. మరో ఇద్దరు ఆయనకు రెండు వైపులా నిలబడి గట్టిగా పట్టుకున్నారు. కాసేపు మాట్లాడిన తరవాత ముందుకు కదిలారు. వెళ్లే ముందు జిన్‌పింగ్‌తోనూ ఏదో చెప్పారు. ఆ తరవాత సిబ్బంది ఆయనను నడిపించుకుంటూ తీసుకెళ్లి బయటకు పంపారు. హాల్‌లో దాదాపు రెండు నిముషాల పాటు అందరూ మౌనంగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేయగా...వైరల్ అవుతోంది. జింటావో సపోర్టర్స్ మాత్రం..ఆయనకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Emperor Xi just had his predecessor Hu Jintao hauled out of the CCP summit on live TV in full view of everyone
— ShapiroExposed.com (@JackPosobiec) October 22, 2022
Ruthless pic.twitter.com/OTnsHKokSu
Don’t act like this is the first time you’ve seen a communist purge pic.twitter.com/pyO7Z8ds5g
— ShapiroExposed.com (@JackPosobiec) October 22, 2022
మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్..
దాదాపు వారం రోజులుగా జరుగుతున్న కాంగ్రెస్‌లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ రాజ్యాంగంలో సవరణలు కూడా చేశారు. ఇదంతా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మూడోసారీ అదే పదవిలో కొనసాగేలా చేసేందుకే. నిజానికి...ఈ వారం రోజుల కాంగ్రెస్ ఉద్దేశం కూడా అదే. జిన్‌పింగ్‌కు మరి కొన్ని అధికారాలు కట్టబెట్టి ఆయననే మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగించేలా తీర్మానం చేస్తారని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే సెంట్రల్ కమిటీలోని 370 మంది సీనియర్ లీడర్స్ కొన్ని కీలక తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ రాజ్యాంగంలోనూ సవరణలు చేశారు. జిన్‌పింగ్‌కి సర్వాధికారాలు కట్టబెట్టే సవరణలు ఇవి. కమ్యూనిస్ట్ పార్టీకి గవర్నింగ్ బాడీగా ఉండే సెంట్రల్ కమిటీ...దేశవ్యాప్తంగా ఎలాంటి విధానాలు అమలు చేయాలో స్పష్టంగా వివరిస్తుంది. అంతే కాదు. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి మార్పులు చేయాల న్నదీ సూచిస్తుంది. ఈ క్రమంలోనే జిన్‌పింగ్‌ను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకునేలా మార్పులు చేశారు. ఇదే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.