IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

తల్లిని షూట్ చేసిన పసివాడు.. జూమ్ వీడియో కాల్‌లో రికార్డైన దారుణ ఘటన

తల్లి జూమ్ కాల్‌లో ఆఫీసు మీటింగులో బిజీగా ఉంది. ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగిందా అని చూస్తే.. ఆమె వెనుకాల ఓ పసివాడి చేతిలో గన్ కనిపించింది.

FOLLOW US: 

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు పదునైన వస్తువులు, మారణాయుధాలను దూరంగా ఉంచాలి. లేకపోతే.. వాటితో వారు తమని తాము గాయపరుచుకోవచ్చు లేదా ఇతరులకు హాని తలపెట్టవచ్చు. ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ ఈ విధంగానే తన ప్రాణాలను పోగొట్టుకుంది. తన అజాగ్రత్త వల్ల ఇంకా మాటలు కూడా రాని పసివాడి చేతిలో హతమైంది. మరణించే సమయంలో ఆమె తన ఆఫీస్ జూమ్ కాల్ మీటింగ్‌లో మాట్లాడుతోంది. దీంతో ఆమె మరణాన్ని వారంతా ప్రత్యక్షంగా చూశారు. 

అల్టామోంటే స్ప్రింగ్స్‌లో నివసిస్తున్న షమయ లిన్ అనే 21 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం (ఆగస్టు 11)న తమ ఆఫీస్ జూమ్ కాల్ మీటింగ్‌లో తోటి ఉద్యోగులతో మాట్లాడుతున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత ఆమె కిందపడిపోయింది. దీంతో అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె వెనకాల నిలుచున్న పసివాడి చేతిలో గన్ చూశామని ఒకరు పోలీసులు తెలిపారు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫోన్ చేశామన్నారు. 

అయితే, పోలీసులు వైద్య సిబ్బందితో ఘటన స్థలికి చేరినప్పటికీ షమయ ప్రాణాలు కోల్పోయింది. బుల్లెట్ నేరుగా ఆమె తలలోకి దూసుకెళ్లింది. ఘటన స్థలంలో గన్ లభించింది. ఆ గన్ షమయ భర్తదని పోలీసులు తెలిపారు. దాన్ని అతడు అజాగ్రత్తా వదిలేయడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని, పిల్లలు ఆ గన్‌తో ఆడుకుంటూ.. తల్లిని షూట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో షమయ భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆమెను షూట్ చేసిన పసివాడు వయస్సు ఎంత అనేది పోలీసులు వెల్లడించలేదు. 

Also Read: లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది.. ఒక్క రాత్రిలో రూ.437 కోట్లకు అధిపతి అయ్యాడు!

పసివాళ్లు ఇతరులకు హాని చేయడమే కాదు.. చేతికి దొరికిన వస్తువులతో ఒక్కోసారి తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. కొద్దిరోజుల కిందట బెంగళూరుకు చెందిన మూడేళ్ల పసివాడు ఆటలాడుతూ నాలుగు సెంటీ మీటర్ల వినాయకుడి బొమ్మను మింగేశాడు. దీంతో బాలుడిని ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని మనిపాల్ హాస్పిటల్‌‌కు తరలించారు. వైద్యులు పిల్లాడికి మత్తు మందు ఇచ్చి ఎండోస్కోపీ విధానంలో బొమ్మను బయటకు తీశారు. తర్వాత 3 గంటలు హాస్పిటల్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉంచారు.  

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!

Published at : 13 Aug 2021 08:33 PM (IST) Tags: Toddler Shoots Mother Zoom Call Murder Florida murder Florida toddler shoots mother ఫ్లొరిడా

సంబంధిత కథనాలు

Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి

Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి

KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ- కేంద్రంపై కేసీఆర్ సీరియస్

KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ-  కేంద్రంపై కేసీఆర్ సీరియస్

Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్

Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్

Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే

Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్‌లో ఉన్న దేశం అదే

Revanth Reddy On CM KCR : మరో శ్రీలంకలా తెలంగాణ, రాజపక్స పరిస్థితే కేసీఆర్ కు వస్తుంది : రేవంత్ రెడ్డి

Revanth Reddy On CM KCR : మరో శ్రీలంకలా తెలంగాణ, రాజపక్స పరిస్థితే కేసీఆర్ కు వస్తుంది : రేవంత్ రెడ్డి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Keerthy Suresh: రోజురోజుకి మహానటి అందం పెరిగిపోతోందిగా

Keerthy Suresh: రోజురోజుకి మహానటి అందం పెరిగిపోతోందిగా

Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా

Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా

MLC Kavita On Congress : కాంగ్రెస్ ఓ తోక పార్టీ, ప్రాంతీయ పార్టీలదే అధికారం- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

MLC Kavita On Congress : కాంగ్రెస్ ఓ తోక పార్టీ, ప్రాంతీయ పార్టీలదే అధికారం- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు