Buggana Rajendranath: సీఎం కార్యాలయం ఉన్నచోటే పరిపాలనా రాజధాని: బుగ్గన రాజేంద్రనాథ్
Buggana Rajendranath: సీఎం ఎక్కడుంటే అదే పరిపాలనా రాజధాని అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కార్యాలయం ఉన్నచోటే పరిపాలనా రాజధాని ఉంటుందన్నారు.
![Buggana Rajendranath: సీఎం కార్యాలయం ఉన్నచోటే పరిపాలనా రాజధాని: బుగ్గన రాజేంద్రనాథ్ Finance Minister Buggana Rajendranath Comments on CM Jagan, AP Capital Buggana Rajendranath: సీఎం కార్యాలయం ఉన్నచోటే పరిపాలనా రాజధాని: బుగ్గన రాజేంద్రనాథ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/2d5c7633a10e6f82af1bde2440251f681675313488438519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Buggana Rajendranath: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే పరిపాలనా రాజధాని అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సీఎం కార్యాలయం ఉన్నచోటే పరిపాలనా రాజధాని ఉంటుందని, రాజ్యాంగంలో రాజధాని అనే ప్రత్యేక పదం లేదని వెల్లడించారు. ప్రభుత్వం ఉద్దేశం గతంలోనే చెప్పామని, మొదటి నుంచి ఇదే చెబుతున్నామని అన్నారు.
త్వరలో నేను కూడా విశాఖకు షిఫ్ట్ కాబోతున్నాను. #InvestInAP #APGIS2023 pic.twitter.com/RSJn9eOj3u
— YSR Congress Party (@YSRCParty) January 31, 2023
సీఎం ఎక్కడ నుంచి పాలన కొనసాగిస్తే అదే రాజధాని అని శాసనసభాపతి తమ్మనేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ... మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అందరూ స్వాగతించాలన్నారు. విశాఖపట్నం రాజధాని అయితే ఉత్తరాంధ్ర నుంచే వలసలు ఆగిపోతాయని చెప్పుకొచ్చారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయమని సభాపతి తమ్మినేని సీతారాం వివరించారు. ఆయన 35 మంది మంత్రుల, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని అంటున్నారని.. వారి పేర్లు బహిర్గతం చేయమనండని అన్నారు.
ఎంపీ కేశినేని కామెంట్లు..
రాష్ట్ర రాజధాని నిర్ణయం ఒకసారి అయిపోయింది, ఇప్పుడు మూడు రాజధానులను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోర్టు చెబితే... కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వారితోనే మూడు రాజధానుల బిల్లు పెట్టిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఆయన విలేకరులతో అధికారం లేదని కోర్టు చెప్పినా.. 3 రాజధానులకు అనుకూలంగా ఉండే వారికే కేంద్రంలో మద్దతునిస్తామని అన్నారు. వికేంద్రీకరణకు అనుకూలంగా రాష్ట్రంలో అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలనూ ఒక పార్టీ గెలిస్తే.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం అడిగింది చేయకుండా ఉండగలదా అని ప్రశ్నించారు. మోదీ ఉన్నా, ఇంకొకరు ఉన్నా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిందే కదా అన్నారు. మే లేదా ఆగస్టులో సీఎం తన కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తానని చెప్పినట్లు వివరించారు.
నిన్నటికి నిన్న విశాఖకు వెళ్తున్నట్లు ప్రకటించిన సీఎం జగన్
విశాఖలో నిర్వహించబోతున్న గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పారిశ్రామితవేత్తల్ని ఆహ్వానించేందుకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన దౌత్యవేత్తల సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కాబోతోందని ప్రకటించారు. తాను కూడా త్వరలోనే అక్కడకు షిఫ్టు అవుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరులు విశాఖ రాజధానిని హైలైట్ చేశారు. ఎవరూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా వాడలేదు. దీంతో ఇక వైఎస్ఆర్‌సీపీ ఒకే రాజధాని అన్న భావనకు వచ్చిందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఉత్తరాంధ్ర మంత్రులు విశాఖ ఒక్కటే రాజధాని అనే ప్రకటనలు చేస్తున్నారు. రాజధానిగా విశాఖ లేకపోతే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఉత్తరాంధ్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. వారి ప్రకటనలను వైసీపీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఖండించలేదు. అంటే.. వ్యూహాత్మకంగానే ఆ ప్రకటనలు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)